ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి నుంచి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి అయిన ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. అధికారంలోకి వచ్చిన మొదటి నేలే పెన్షన్లను భారీగా పెంచింది. తర్వాత అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశారు. ఇప్పుడు ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అన్నతాద సుఖీభవతో పాటు తల్లికి వందనం కార్యక్రమాన్ని వచ్చే మార్చిలోపు పూర్తి చేయబోతున్నారు. ఎక్కడా హడావుడి లేకుండా పథకాల అమలును ప్రణాళికాబద్దంగా చేపడుతున్నారు.
నాడు జీవోలిచ్చి అదే అమలు అన్న జగన్ రెడ్డి
వైసీపీ హయాంలో మొదటి కేబినెట్లో అన్ని పథకాలకు ఆమోదం అని ప్రకటించేసుకున్నారు. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చరు. మొదటి నెలలోనే ఎనభై శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పుకున్నారు. జగన్ రెడ్డి మైండ్ సెట్‌పై అప్పటికే చాలా మందికి అనుమానం వచ్చింది . జీవోలు విడుదల చేస్త హామీలు అమలు చేసినట్లా అనుకున్నారు. చివరికి సీపీఎస్ రద్దుపైనా ఓ ఫేక్ జీవో రిలీజ్ చేశారు. ఇలాంటి పిచ్చి పాలన చేసిన ఆయన తాను హామీల్ని తెగ అమలు చేశానని అనుకుంటూ ఉంటారు.
ముందు తన ఖాతాకు బదిలీ.. ఎప్పటికో లబ్దిదారుల ఖాతాలకు !
జగన్ రెడ్డి హయాలో ముందు తన ఖాతాకు నగదు బదిలీ అయ్యేది. ఫుల్ పేజీ ప్రకటనలు సాక్షికి ఇచ్చేవారు. తర్వాత ఓ బహిరంగసభ పెట్టి బటన్ నొక్కేవారు. కానీ లబ్దిదారుల ఖాతాల్లో నగదు పడేవా అంటే… పడినప్పుడు తీసుకోవలన్నట్లుగా ఉండిద. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ప్రకటనలు ఇచ్చి బటన్లు నొక్కారు కానీ అకౌంట్లో డబ్బులు పడలేదు. ఎంత ఘోరం అంటే..ఫీజు రీఎంబర్స్ మెంట్, హాస్టల్ ఫీజులు కనీసం మూడు వేల కోట్లు పెండింగ్ లో పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు జీవోలు కాదు..అమలే ప్రాతిపదిక !
ఇప్పుడు జీవోలు కాకుండా అమలు చేయడాన్నే ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం పని చేస్తోంది. నాలుగు నెలలు పూర్తి కాక ముందే హమీలు అమలు చేయలేదని జగన్ రెడ్డి డాన్సులు వేస్తున్నా ప్రభుత్వం మాత్రం తాను చేయాలనుకున్నది సమర్థంగా చేసేందుకే ప్రయత్నిస్తోంది. వ్యవస్థల్ని మారుస్తూ.. ఆదాయాన్ని పెంచుకుంటూ … హామీల్ని అమలు చేసే దిశగా వెళ్తోంది. నాడు జీవోలిచ్చి ప్రజల్ని ఆశల పల్లకీలో ఊరేగించేవారు. నేడు అమలు చేసి నేరుగా లబ్ది కలిగిస్తున్నారు . అదే తేడా !