ఆంధ్రులకు రాజధాని ఎక్కడ…? రాష్ట్ర విభజన తర్వాత మరీ ముఖ్యంగా జగన్ సీఎం అయ్యాక ఏపీ అంటే చులకన భావం ఏర్పడింది. అమరావతిని పక్కనపెట్టి… ఆంధ్రులకు రాజధానియే లేకుండా చేశారు. చేపట్టిన నిర్మాణాలను మధ్యలోనే ఆపేసి, అనాధగా మార్చేశారు.
అయితే, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును రాష్ట్రం నలుమూలల ప్రజలు ఆశీర్వదించటంతో… బాబు అమరావతిపై ఫోకస్ పెంచారు. చంద్రబాబు గెలవగానే సీఆర్డీయే మళ్లీ యాక్టివ్ కాగా, ఇప్పుడు నిర్మాణాలు పరుగులు పెట్టబోతున్నాయి.
గురువారం చంద్రబాబు అమరావతిలో పర్యటించబోతున్నారు. నిర్మాణాలు ఎక్కడ వరకు చేసి ఆగిపోయాయి, ఇంకేం చేయాలి… ఎన్ని నిధులు అవసరం పడతాయి ఇలా అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పర్యటించి, రివ్యూ చేయబోతున్నారు. దీంతో సీఆర్డీయే అధికారులు ఆగమేఘాల మీద ముళ్ల కంపలు, భారీగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.
చంద్రబాబు సర్కార్ త్వరలో రెగ్యూలర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆ బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించబోతున్నారు. దీనికి తోడు రాజధాని ప్రాంతంలో రియల్ బూమ్ కూడా స్టార్ట్ అవుతోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు కూడా భారీగా నిధులు సమకూరనున్నాయి.