ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్ ప్రయోజనాలు, అవసరాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటోంది. ఓ వైపు రాజధాని నిర్మాణ పనులు చేపడుతూనే..అమరావతి విస్తరణకు సమాయత్తం అవుతోంది.
రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాల భూసేకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తోపాటు అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపలి ఇన్నర్ రింగ్ రోడ్డులకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా…భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 30వేల ఎకరాల సేకరణకు సర్కార్ రెడీ అయింది.
కోర్ క్యాపిటల్‌కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదిత భూసేకరణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనంతరం దీనిపై మరింత స్పష్టత రానుంది. ఏదేమైనా చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నాలుగేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.