ప్రత్యేక ప్యాకేజి కింద ఎపికి రావలసిన నిధులు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ప్రత్యేక హౌదాను మించిన ప్యాకేజీ సాధించామని ప్రశంసలు కురిపించిన వారికి ఇది ఇబ్బంది కరమే. అంతటితో ఆగక అప్పట్లో అసెంబ్లీలో ప్రత్యేకంగా కృతజ్ఞతల తీర్మానం కూడా చేయించారు.ఈ ప్యాకేజి మిథ్య అని ఇందులో పరిమాణం(క్వాంటిఫికేషన్) లేదని నేను పదే పదే వాదించాను. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే లేఖరాయడం ద్వారా అది అంగీకరించారన్నమాట. 2015-16లో 2980 కోట్లు, 16-17లో 2854 కోట్లు మాత్రమే వచ్చాయని ఆ లేఖలో రాశారు. ఈ మొత్తం ఒక్క ఏడాది రెవెన్యూలోటుకు కూడా సరిపోదు. ఇప్పటికీ ఆ లోటు ఎంతో నిర్ధారించకుండా జాగు చేస్తున్నారు. ఈ లోటు ముచ్చట అటుంచితే ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి రుణాలు తెచ్చుకుంటే కేంద్రం కట్టేస్తుందని అప్పట్లో వూరించారు. ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాటు లేఖతో ఆ నిధులు కూడా రాలేదని తేలిపోయింది.హళ్లికి హళ్లి సున్నకు సున్నగా హౌదా పోయింది ప్యాకేజీ రాలేదు. ఆ మాట ముఖ్యమంత్రి లేఖ రాయొచ్చు గాని మనం అంటే మాత్రం అపరాధం.