హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఎన్నో అంచనాలతో ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులూపుకుంటూ రావాల్సివస్తోంది. మోడి ప్రభుత్వం ఆ ఒక్కటీ తప్ప అన్నీ మాట్లాడింది. ఏపీ రెవెన్యూ లోటు పూడుస్తామని, రాజధాని నిర్మాణానికి నిధులిస్తామని, వెనకబడిన జిల్లాలకు నిధులిస్తామని, విభజన చట్టం హామీలు నెరవేరుస్తామని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. ఇక మన ఘనత వహించిన ముఖ్యమంత్రిగారేమో, హైదరాబాద్లో ఎదుర్కొంటున్న అవమానాలగురించి, సెక్షన్ 8 గురించి, విజయవాడలో సరైన కార్యాలయం లేకపోవటంగురించి, ఉద్యోగులు అమరావతికి రాకపోవటంగురించి ఫిర్యాదుల జాబితా చదివారు. వీటన్నింటిగురించి తాను మోడికి వివరించానని చెప్పుకొచ్చారు. అసలు మీరు వెళ్ళింది ప్రత్యేకహోదా గురించి అడగటానికా, ఫిర్యాదులు ఏకరువు పెట్టటానికా బాబుగారూ!