తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుుడు ఢిల్లీ వెళ్లి అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు. మొదట అమిత్ షా ఇంటికి చంద్రబాబు వెళ్తే… కాసేపటికే జేపీ నడ్డా కూడా వచ్చారు. వారి మధ్య జరిగింది పూర్తిగా రాజకీయ పరమైన చర్చేనని ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. ఆ రాజకీయ చర్చ ఏమిటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది . టీడీపీతో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. ఎన్టీఏలో చేరాలని టీడీపీని అమిత్ షా ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు.
అయితే ఏపీలో కలిసి పని చేయడం.. పోటీ చేయడం అనేది సంక్లిష్టలతో కూడి ఉందని… వైసీపీకీ, జగన్ కు బీజేపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న భావన ప్రజల్లో పాతుకుపోయిందని చంద్రబాబు అమిత్ షాకు చెప్పినట్లుగా భావిస్తున్నారు. రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా కేంద్రం సపోర్ట్ చేయడంతో పాటు విచ్చలవిడిగా అప్పులు చేయడానికి అంగీకరించడం .. ఇతర ప్రయోజనాలు కల్పించడం…. చివరికి వివేకా హత్య కేసులోనూ కాపాడుతూండటం వంటివి ప్రజల్లో బాగా చర్చనీయాంశమవుతున్నాయి చంద్రబాబు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీతో బీజేపీ కలిసినా అది మైనస్సే అవుతుందని.. ముందు వైసీపీకి వ్యతిరేకం అనే భావన బీజేపీ తేవాలని.. చంద్రబాబు కోరినట్లుగా భావిస్తున్నారు.
అయితే ఒక్కటి మాత్రం నిజమని.. వైసీపీకి ఇలాంటి సహకారం కొనసాగిస్తూ ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం .. లేకపోతే ఎన్డీఏలో చేరడం అనేది జరగదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా టీడీపీ నుంచి సహకారం పొందాలంటే.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటే… బీజేపీ .. టీడీపీ ఇచ్చే ఇన్ పుట్స్ ను ఫాలో అవుతుంది. లేకపోతే అవదని.. వచ్చే రెండు, మూడు వారాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు..