ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో అరగంటపాటు చర్చించారు. ప్రధానంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉండాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.
గత ఐదేళ్లలో జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, వాటి నుంచి వేగంగా కోలుకోవాలంటే రాష్ట్రానికి కేంద్రం సాయం తప్పనిసరి అని చంద్రబాబు నివేదించినట్లు సమాచారం. అభివృద్ధిలో ఏపీ దూకుడు పెంచాలంటే రాజధానిగా అమరావతికి కీలక సాయం అవరమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అలాగే..ఏపీలో అధ్వానంగా మారిన రోడ్లు, విభజన హామీలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు కేంద్రమంత్రుల్ని కలవనున్నారు.కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరనున్నారు.