అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళవుతున్నా సరే ఇంకా కూడా బొమ్మలాటే ఆడుకుంటున్నాడు చంద్రబాబు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండాలంటే ఈ బొమ్మలను చూపించి ప్రజలను భ్రమల్లో ఉంచడమే కరెక్ట్ అన్న బ్రహ్మాండమైన ఆలోచన ఏదో చంద్రబాబుకు ఉన్నట్టుగా ఉంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటి ఓడిపోవడం, భూమానాగిరెడ్డి ఇష్యూతో వచ్చిన చెడ్డపేరు, అగ్రిగోల్డ్ ఇష్యూతో వచ్చిన చెడ్డపేరు….అన్నింటికీ మించి ఓ వైపు కరువు, మరోవైపు సమ్మర్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉడికిపోతున్న నేపథ్యంలో మరోసారి బొమ్మలాటకు తెరలేపాడు చంద్రబాబు. ఇంకో రెండు నెలల్లో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతున్న నేపథ్యంలో కూడా ఈ బొమ్మలాటకు మరోసారి తెరతీశాడు చంద్రబాబు. ఈ సారి బొమ్మల విషయంలో మరి కాస్త క్రియేటివిటీ చూపించాడు. ఇంతకుముందు వరకూ కేవలం నిర్మాణాలు మాత్రమే ఉండేవి. ఆ నిర్మాణాలన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి అని చెప్పినా నమ్మకం కలిగేది కాదు. కొన్ని బొమ్మల్లో ఉండే నిర్మాణాలు అయితే…. ఈ భూమి మీద ఆ స్థాయి నిర్మాణాలు ఎక్కడైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వచ్చేలా ఉండేవి. అందుకే ఈ సారి కొత్తగా ఆలోచించాడు చంద్రబాబు. ఆ గ్రాఫిక్స్ బొమ్మలలో ఉన్న భవనాల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలను కూడా యాడ్ చేశాడు. అది కూడా మరీ పల్లెటూర్లలో ఉండే జనాల బొమ్మలు కూడా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. నేటివిటీ టచ్ ఉండేలా చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే. సినిమా డైరెక్టర్ అయి ఉంటే రాజమౌళిని మించిపోయి ఉండేవాడేమో.
చంద్రబాబు ఆ బొమ్మలను రిలీజ్ చేయడం ఆలస్యం…..భజన మీడియాలో ఉన్న జర్నలిస్ట్స్, జర్నలిస్ట్ హెడ్స్ అందరూ నిద్రహారాలు మానేసి వార్తలు వండేశారు. గ్రామాల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు, గ్రామాలకు గ్రామాలే వలస పోతున్నాయి, పనులు లేవు, బ్రతకడం ఎలాగో తెలియక భయపడుతున్నవాళ్ళు ఎందరో….వాళ్ళందరి సమస్యలూ తీర్చడం అంటే చంద్రబాబుకు చాలా కష్టం. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండేలా లేదు. అసెంబ్లీ భవనం చుట్టూ చెట్లు ఉండడం, సింగపూర్ స్థాయి భవనాలు లేకపోవడం చూసి నెగిటివ్‌గా కామెంట్స్ చేసిన మహానాయకుడు చంద్రబాబు. అందుకే వాళ్ళందరి కష్టాలూ తీర్చే ప్రయత్నం చేయడం కంటే కూడా త్రీడి ఎఫెక్ట్స్‌తో ఓ మంచి బొమ్మల సినిమాను చూపిస్తే సరి అని చెప్పి చంద్రబాబు కార్పొరేట్ బుర్రకు ఈ బొమ్మల సినిమా ఐడియా వచ్చేసినట్టుంది. వెంటనే మిగతా పనులన్నీ వదిలేసి ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలను పరిశీలిస్తే మాత్రం అర్థమయ్యేది ఒక్కటే. 2019 ఎన్నికల వరకూ కూడా ఈ బొమ్మల సినిమానే చూపిస్తూ ఉంటాడు చంద్రబాబు. మహా అయితే ఒక రెండు భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఇక నేను శంకుస్థాపన చేసిన రాజధాని పూర్తవ్వాలంటే నాకు మాత్రమే ఓటెయ్యండి అని ప్రజలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి కూడా చంద్రబాబు వెనుకాడడనడంలో సందేహం లేదు. మూడేళ్ళ కాలంలో ఒకటి రెండు తాత్కాలిక భవనాలను నిర్మించడానికే చంద్రబాబు ప్రభుత్వం అపసోపాలు పడింది. ఆ భవనాల నిర్మాణంలో ఉన్న లోపాల గురించి టిడిపి నాయకులే ఎన్నో విమర్శలు చేస్తున్నారు. మరి ఇక మిగిలి ఉన్న రెండేళ్ళ కాలంలో ఏదో అద్భుతాలు చేస్తారని ఎలా ఆశిస్తాం? ఈ టెర్మ్‌కి చంద్రబాబు చూపించే బొమ్మల సినిమాతో సరిపెట్టుకోవాలన్నమాట. 2019లో కూడా చంద్రబాబునే గెలిపిస్తే అప్పుడైనా నిర్మాణాలు చేపడతాడో లేదో చెప్పలేం. లేకపోతే ఈ డిజైన్స్ కూడా బాగాలేవు….ఈ సారి మరోదేశం నుంచి డిజైన్స్ తెప్పిస్తా అని సూపర్ ట్విస్ట్ ఇచ్చినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. మొదటి సంతకంతోనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు…..అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీలు ఎంత వరకూ చెయ్యాలి? ఎలా చెయ్యాలి అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఓ కమిటినీ నియమిస్తూ సంతకం చేయలేదా? ఎన్నో కష్టాలు అనుభవించిన….ఎంతో ధైర్యంగా ఉండే రైతులు కాబట్టి చంద్రబాబు ఇచ్చిన షాక్‌ను తట్టుకోగలిగారు కానీ ……లేకపోతేనే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిపొయ్యి…..ఇంకా ఏమేమి అయిపోయి ఉండేవాళ్ళో కదా?