జగన్‌ను నమ్మినా.. నమ్మి ఓటేసినా… జైలుకు పంపిస్తారని.. టీడీపీ అధినేత చంద్రబాబు… ప్రజలను హెచ్చరించారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడన్నారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేర చరిత్ర ఉన్న పార్టీ అని.. ఆ పార్టీని ఏ మాత్రం ఆదరించినా… ప్రజలు ఇబ్బంది పడతారనన్నారు. ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటని మండిపడ్డారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తూంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డును ఈ సారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్విడ్ ప్రో కో.. పద్దతిలో… ప్రభుత్వం భూములు కేటాయించి… పారిశ్రామిక వేత్తల వద్ద నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల రూపంలో… లంచాలు స్వీకరించారు. ఆకేసుల్లో అనేక మంది రాజకీయ నేతలే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. అలాంటి వారిలో శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ పరిస్థితి మరీ దారుణం. కర్ణాటక క్యాడర్‌కు చెందిన మరో ఐఏఎస్ అధికారి రత్నప్రభ.. కోర్టులోనే జగన్మోహన్ రెడ్డిని చెడామడా తిట్టేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత.. ఇప్పుడు పార్టీ నేతలకు తెలియకుండా.. వారిపై… పాం-7లు దాఖలు చేయడంతో.. దాదాపుగా.. ప్రతీ నియోజకవర్గంలోనూ… కొంత మంది ముఖ్య నేతలు… క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికే.. నాలుగు వందల వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దాంతో.. వైసీపీ క్యాడర్లో ఓ రకమైన భయం ఏర్పడింది.
ఇక తాజాగా.. తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ ప్రభుత్వంపై కుట్ర చేసినట్లుగా.. టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ కుట్రకు సంబంధించిన స్కెచ్ అంతా బయటకు రావడం… కోర్టుల్లో కచ్చితంగా.. అది రాజద్రోహం కేసుగా మారుతుందని న్యాయనిపుణులు విశ్లేషిస్తూండటంతో… తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆందోళనలోఉన్నారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సాయం చేయడానికి.. వచ్చిన ఒత్తిళ్లతో చేసిన ప్రయత్నాల వల్ల తాము కూడా కేసుల్లో ఇరుక్కుపోతామని భావనలో వారు ఉన్నారు. దీన్నుంచి ఎలా బయటపడాలా అనే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు ప్రచారం చేసి.. జగన్‌ను ఎవరు నమ్మినా.. జైలు పాలు చేస్తారని.. ప్రచారం చేసే వ్యూహం కనిపిస్తోంది