ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు విజయవాడలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణదినం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉండటంతో ఆ విశ్వవిద్యాలయం పేరు మార్చే చేశారు.
ఏపీకి కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా జగన్ ప్ర భుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయాన్ని పొట్టి శ్రీరాములు పేరుతోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ ఏర్పాటు కోసం ఆమరణదీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రాణార్పణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అందుకే పొట్టి శ్రీరాములును తెలుగు ఎప్పటికీ స్మరించుకుంటారు.
పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్లం అంటున్నామని అన్నారు.తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను చనిపోయినా పరవాలేదు అని మన తెలుగు వారికోసం ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ‘పొట్టి శ్రీరాములు యూనివర్శిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నేను నామకరణం చేశానని గుర్తు చేసుకున్నారు.