అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోనున్నారు. ఇందు కోసం వెలగపూడిలో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ స్థలం ఉంటుంది. ప్రస్తుతం సచివాలయం కూడా వెలగపూడిలోనే ఉంది. అమరావతి నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం అంతా వీఐపీ జోన్ గా మారే అవకాశం ఉంది. అధికారులు, కలెక్టర్లు, న్యాయమూర్తులు ఇలా అనేక మందికి నివాస సముదాయాలు ఆ చుట్టుపక్కలే నిర్మిస్తున్నారు.
అమరావతిలో చంద్రబాబుకు ఇల్లు లేకపోవడం అనేది జగన్ రెడ్డికి వైసీపీకి పెద్ద మ్యాటర్. తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని చంద్రబాబే కట్టుకోలేదని అంటే ఆయనకే అమరావతిపై ప్రేమ లేదని తాను కారిపోయేంతగా ఉందని ప్రజల్ని నమ్మించారు. చివరికి ఆయన అమరావతి నెత్తి మీద ఎలా చేయిపెట్టారో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అమరావతి నిర్మాణం పై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. మూడేళ్లలో మొత్తం అధికారభవనాల నిర్మాణం పూర్తయిపోతుంది. ఈ లోపే చంద్రబాబు నివాసం కూడా నిర్మాణం పూర్తి చేయనున్నారు.
ఉండవల్లిలోని కరకట్ట పక్కన ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్లో చంద్రబాబు ఉటున్నారు. దీనికి అద్దె చెల్లిస్తున్నారు. అయితే చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద తీసుకున్నారని జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కేసులు కూడా పెట్టారు. కానీ ఆ ఇల్లు చేతులు మారిందని నిరూపించలేకపోయారు. వారి తెలివి తేటల్ని చూసి కోర్టులు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. విచిత్రం ఏమిటంటే.. ఆ ఆస్తుల్ని అటాచ్ కూడా చేశారు. చంద్రబాబు ఇంటి నిర్మాణం తర్వాత.. చాలా అంశాలపై వైసీపీ నేతలకు క్లారిటీ వస్తుంది.