తెలుగుదేశం పార్టీ అధినతే చంద్రబాబు నాయుడు తన 90ల్లోని రాజకీయాల పవర్ ఫుల్ పాత్రను మరోసారి పోషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆయన అత్యంత పవర్ ఫుల్ లీడర్లలో ఒకరు., ప్రధాని మోదీ, మోహన్ భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ తర్వాత చంద్రబాబే పవర్ ఫుల్ అని ఇండియాటుడే ప్రకటించింది.
ఇండియాటుడే. ప్రకటించిన అంశంలో వింతేమీ లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఓ ప్రసిద్ధ సంస్థ ఇలా ప్రకటించడంతో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తాము ఎన్డీఏలో కలిసి పోటీ చేశాం… ఎన్డీఏతోన వెళ్తాం అని ఒక ప్రకటన చేశారు. దాంతో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. అలాంటి పవర్ ను ఆయన ఎన్నికల ఫలితాల రోజున సాధించారు. ఇప్పుడు ఆ పవర్ ఫుల్ పాత్ర కొనసాగుతోంది. రాను రాను ఆయన పాత్ర మరింత కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
చంద్రబాబునాయుడు ఇలాంటి రోల్ పోషించడం కొత్తేమీ కాదు. ఆయన 1990ల్లోనే దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా దేవేగౌడ, గుజ్రాల్, వాజపేయి ఎవరు ఉన్నా చంద్రబాబు పాత్ర కీలకం. కేంద్ర నిర్ణయాల్లో చంద్రబాబు అభిప్రాయం కీలకం. ఇప్పుడు కూడా మళ్లీ ఆ పవర్ సాధించారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత కోలుకుంటారా అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఆయన ఫీనిక్స్ లా పైకి ఎగిరారు.
చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయినా తన రోల్ ఎంత వరకో అంత వరకే రాజకీయం చేస్తారు. అదే ఆయనను రాజకీయాల్లో ఇంత సుదీర్ఘకాలం ఉండేలా చేసింది. రానున్న రోజుల్లో మరింత పవర్ ఫుల్గా చంద్రబాబు ఎదుగుతారని అనుకోవచ్చు.