చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు. అంతకు ముందు అది ప్రగతి భవన్.కేసీఆర్ నివాసం. అక్కడే జగన్, కేసీఆర్ లు పలుమార్లు సమావేశం అయ్యారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి అదే ఖరారు చేశారు.
నాటి ప్రగతి భవన్ నేటి ప్రజా భవన్లో మూడు భవనాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ నివాసం. అందులో ప్రస్తుతం భట్టి విక్రమార్క ఉంటున్నారు. రెండోది అధికారిక సమావేశాల కోసం.. ఉంటుంది. అందులోనే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని భవిస్తున్నారు. జగన్ గెలిచిన తర్వాత ప్రగతి భవన్ కు వచ్చారు. మూడు, నాలుగు సార్లు మీటింగ్లు జరిగాయి కానీ ఏవీ అధికారిక సమావేశాలు కాదు. ప్రైవేటుగా చర్చించుకుని వెళ్లిపోయేవారు.
ఒక్క సారి మాత్రం.. రెండు రాష్ట్రాల కలిసి కాళేశ్వరం లాంటి బడా ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు వేశాయి. ఓ రెండు లక్షల కోట్ల అప్పును రుద్దేయాలని ప్లాన్ చేసుకున్నారు. పోలవరాన్ని ఆపేయాలనుకుున్నారు. కానీ ఎందుకో ఆ ప్లాన్ ముందడుగు పడలేదు. ఇప్పుడు చంద్రబాబు , రేవంత్ మధ్య అధికారిక సమావేశం జరగనుంది.