ఆంధ్రప్రదేశ్ అధికారుల్లో ఎన్నికల సంఘం… విభజన తీసుకు వస్తోందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఐదేళ్ల పాటు అధికారులు కష్టపడటం వల్ల… ఆంధ్రప్రదేశ్ నిలబడిందని.. ఇప్పుడా అధికారుల మధ్య కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో చీలక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొద్ది రోజులుగా.. సీఎస్ తో పాటు… సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. ఐఏఎస్‌లతో ప్రకటనలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌ల సంఘం మీటింగ్‌ను కూడా వీరి ప్రొద్భలంతోనే ఏర్పాటు చేశారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఎన్నికల సంఘం పరిధిలో… ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు మాత్రమే పని చేయాలన్నారు. మిగిలిన వాళ్లు ప్రభుత్వం కిందే పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరి పరిధిలో వారు పని చేయాలని.. ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతోందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టడం.. ఎన్నికల కోడ్ పేరుతో.. ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా చేయడంతో.. అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. దానికి తోడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే చీఫ్ సెక్రటరీని.. ఈసీకి తనకు ఉన్న అధికారాలతో.. అపాయింట్ చేయడంతో.. సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసీ.. ఎన్నికల విధులకు సంబంధించిన బదిలీలు.. వ్యవహారాలు చూసుకోవడం నైతికత. కానీ.. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలు చూసుకునే చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం… ఆ స్థానంలో… ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించడంతో.. చిక్కులు ప్రారంభమయ్యాయి. అప్పట్నుంచి ప్రభుత్వం అచేతన స్థితికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… ఏపీలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించారు. పాలన అస్తవ్యస్తమవుతోందన్న టీడీపీ నేతల ఆందోళనతో చంద్రబాబు ఏకీభవించారు. ఈసీ దేశవ్యాప్తంగా ఎలా వ్యవహరిస్తోంది.. ఏపీలో ఎలా వ్యవహరిస్తుందో… వివరించారు. ఈసీ ఆదేశాలతో సీఎస్ కుర్చీ దక్కించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం… వైసీపీ గవర్నమెంట్ వస్తే.. ప్రాధాన్య పోస్టులు ఇప్పిస్తామని.. ఇతర అధికారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించి.. విభజన తెచ్చేందుకు ప్ర.యత్నిస్తున్నారనేది.. టీడీపీ నేతల ప్రధాన అభియోగం. చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.