హెరిటేజ్ కంపెనీ నుంచి వస్తున్న ఆదాయంతోనే తమ కుటుంబం గడుస్తోందని… నారా లోకేష్ ప్రకటించారు. ఆయన కుటుంబ ఆస్తులను అమరావతిలో ప్రకటించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి రూ.88.66 కోట్లుగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆస్తి మొత్తం రూ.2.9 కోట్లు అన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు రూ.8 కోట్లు కాగా, నారావారి పల్లెలో ఇల్లు రూ.23.83 లక్షలుగా ప్రకటించారు. నారా భువనేశ్వరి ఆస్తి రూ.31.01 కోట్లు కాగా, తన ఆస్తి రూ.21.40 కోట్లు అని లోకేష్ తెలిపారు. నారా బ్రాహ్మణి ఆస్తి రూ.7.72 కోట్లు, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తి రూ.18.71 కోట్లుగా తెలిపారు. నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అన్నారు. హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లు ఉందన్నారు. అయితే ఇవన్నీ మార్కెట్ విలువలు కాదన్నారు. తాము కోనుగోలు చేసినప్పుడు.. ఎంత విలువో అంతే ప్రకటిస్తున్నామన్నారు. మార్కెట్ విలువ ప్రతిసారీ పెరుగుతుందని గుర్తు చేశారు.
ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఇంటి కోసం తీసుకున్న రూ.5.31 కోట్ల అప్పు, భువనేశ్వరి రూ. 22.35 కోట్లు, నారా లోకేష్ రూ. 5.88 కోట్లు ,బ్రహ్మణి రూ. 5.66 కోట్లు అప్పులు ఉన్నట్లు లోకేష్ తెలిపారు. కుటుంబ ఆస్తులను లోకేష్ వరుసగా ఎనిమిదో సారి ప్రకటించారు. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆస్తులను ప్రకటిస్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాజకీయ కుటుంబం ఆస్తులను ప్రకటించడంలేదని .. ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే.. ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. కుటుంబం రాజకీయంపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్‌ను స్థాపించారని.. ఇప్పుడా సంస్థను తల్లి భువనేశ్వరి ఎంతో సమర్థంగా ఆ సంస్థను నడిపిస్తున్నారన్నారు.
బ్రహ్మణి రూ. 5.66 కోట్లు అప్పులు ఉన్నట్లు లోకేష్ తెలిపారు. కుటుంబ ఆస్తులను లోకేష్ వరుసగా ఎనిమిదో సారి ప్రకటించారు. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆస్తులను ప్రకటిస్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాజకీయ కుటుంబం ఆస్తులను ప్రకటించడంలేదని .. ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే.. ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. కుటుంబం రాజకీయంపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్‌ను స్థాపించారని.. ఇప్పుడా సంస్థను తల్లి భువనేశ్వరి ఎంతో సమర్థంగా ఆ సంస్థను నడిపిస్తున్నారన్నారు.
చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటనపై విపక్షాలు సహజంగానే విమర్శలు చేస్తూంటాయి. ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటిస్తూంటారు కాబట్టి.. మళ్లీ కొత్తగా ఎందుకని.. వైసీపీ నేతలు… విమర్శలు చేస్తూంటారు. అదే సమయంలో… తమ పార్టీ నేతలు.. ఏటికేడు ప్రకటించడంపై మాత్రం …ఎలాంటి స్పందనా వ్యక్తం చేయరు. ఇరవై ఏళ్ల కింద కొనుగోలు ఇంటికి ఇప్పటి మార్కెట్ రేటు పోల్చి… విమర్శలు చేస్తూంటారు. అంత తక్కువకు ఇస్తారా అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తూంటారు. కానీ ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన వైసీపీ నేతల ఆస్తుల గురించి మాత్రం వారు ఎలాంటి ప్రకటనలు చేయరని.. నిజాయితీ జగన్ ఆస్తులు ప్రకటించాలని.. టీడీపీ నేతలు సవాల్ చేస్తూంటారు కానీ.. అటు వైపు నుంచి స్పందన రాదు..!