చంద్రబాబును చట్టవిరుద్ధంగా , సాక్ష్యాల్లేకుండా.. ఎఫ్ఐఆర్ లేకుండా వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని చేసిన అక్రమ అరెస్టు ఆయనను పాతాళంలోకి పడిపోయేలా చేసింది. అయితే అంతటితోనే ఆయన పరిహారం చెల్లించుకున్నట్లు కాదు. ఆయనకు ముందు ముందు తాను చేసిన తప్పుడు పనులు, కుట్రలపై పూర్తి స్థాయిలో ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి అత్యంత భయంకరంగా ఉండే అవకాశం ఉంది.
తప్పుడు కేసులపై నేడో రేపో బయటకు రానున్న సంచలన నిజాలు
చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా వేధించారు. ఇంటలిజెన్స్ చీఫ్ తో పాటు కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారిని పావుగా పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి..తప్పుడు ఆధారాలు సృష్టించి .. చేయని అరాచకం లేదు. అన్ని రికార్డెడ్. చంద్రబాబు కుటుంబసభ్యులను కూడా వేధించారు. చివరికి భువనేశ్వరి, బ్రాహ్మణిలను కూడా వదల్లేదు. వారినీ అరెస్టు చేస్తామని బెదిరించారు. తప్పుడు మార్గం ఐటీ రిటర్నులు సేకరించారు. చంద్రబాబు విషయంలో వీరు చేసిన అధికార దుర్వినియోగం బయటకు తెలిసింది చాలా తక్కువ. అదంతా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. త్వరలో సంచలన విషయాలు బయటకు రానున్నాయి.
రాజకీయాల్లో ఎవరూ చేయకూడదని తప్పు
ప్రతిపక్ష నేతను అరెస్టు చేసి.. ఆరు నెలల పాటు జైల్లో ఉంచి.. తర్వా త ఎన్నికల్లో గెలవాలన్నది అసలు కుట్ర. ఈ కుట్రకు ఎక్కడ బీజం పడిందో.. ఎవరెవరు ఆ సమావేశాల్లో పాల్గొన్నారో.. జగన్ లండన్ ఉన్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మొత్తం ఓ స్క్రిప్ట్ ప్రకారం చేసుకున్నారు . ఎలాంటి ఆధారాలు లేకపోయినా రిమాండ్ కు తరలించేలా ముందుగానే ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్యంలో… ప్రతిపక్ష నేతల్ని ఇలా జైలు పాలు చేసి గెలవాలనుకోవడం… భయంకరమైన తప్పు. దాన్ని జగన్ చేశారు. అది జగన్ రాజకీయ జీవితం మొత్తం వెంటాడుతుంది.
అధికార దుర్వినియోగానికి ఉదాహరణ
జగన్ అనే ఓ క్రమినల్ మైండ్ సెంట్ ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే.. అతనికి పోలీసులు క్రిమినల్స్ గా మారి సహకరించిన వైనంతో పూర్తి స్థాయిలో ఏపీ మాఫియా రాజ్యంగా మారింది. దాని పరిణామాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ముందు ముందు మరింత సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో దేశం మొత్తం చర్చించుకునేలా ఈ వివరాలు ఉంటాయనుకోవచ్చు.