తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీలో ఓటింగ్ ముగిసిన మర్నాడే ఢిల్లీకి చేరిపోయారు. ఈవీఎంలపై ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు. ఏపీలో జరిగిన పరిణామాలతో.. అనుమానంగా చూస్తున్న వారందర్నీ… మోడీ.. ఈవీఎంలతో ఏదో చేసి గెలిచేయబోతున్నారన్న అనుమానాల్ని బలంగా కలిగేలా చేయగలిగారు. అంతటితో ఆపలేదు. జాతీయ రాజకీయ పరంగా… ఇదే… మొదటి అడుగు. ఆదివారం… ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో.. ఎన్నికల నిర్వహణ విషయంలో… ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరును… గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నారు.
అదే సమయంలో.. అన్నీ పార్టీలకూ.. ఉమ్మడి టార్గెట్ గా ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంలను.. రిగ్గింగ్ చేస్తున్నారో.. ట్యాంపర్ చేస్తున్నారో కానీ.. బీజేపీ కచ్చితంగా వాటిని ఉపయోగించుకుని…. విజయాలు సాధిస్తోందన్న అభిప్రాయాన్ని మాత్రం… ప్రజల్లోకి పంపేందుకు.. ఏ చిన్న అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదులు కోవడం లేదు. అందుకే… వీవీ ప్యాట్ల విషయంలో.. రివ్యూ పిటిషన్ కు సిద్ధమయ్యారు. దేశంలో ఇన్ని పార్టీలు… ఒకే సారి… ఒకే డిమాండ్ ను వినిపిస్తూండటంతో.. పెడిచెవిన పెట్టడం.. ఏ రాజ్యాంగ వ్యవస్థకయినా సాధ్యమయ్యే విషయం కాదు. అలా చేస్తే ప్రజల గొంతుకను.. గౌరవించడం కూడా కాదు. అందుకే… రాజకీయ పార్టీల పోరాటానికి ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా… చంద్రబాబు నేతృత్వంలో జరిగే సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరవుతారు. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేసుకుంటారు.
ఈవీఎంల విషయంలో…. ఏ మాత్రం ప్రజల్లో.. అలజడి రేగినా.. అది.. ఎన్నికల ప్రక్రియపైనే అనుమానం కలిగేలా చేస్తుంది. ఇప్పిటికే.. ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. అవి రోడ్డెక్కే పరిస్థితి తీసుకు వస్తే… మొత్తానికే వ్యవస్థ కదిలిపోతుంది. బీజేపీకి.. ఆ పార్టీకి నిఖార్సైన మిత్రపక్షంగా ఉన్న వైసీపీకి మాత్రమే.. ఈవీఎంలపై నమ్మకం ఉంది. ఇప్పుడు ఏ పార్టీకి నమ్మకం లేదు. మొత్తానికి చంద్రబాబు ఇక ఢిల్లీ నుంచే… మిగతా రాజకీయం చక్కబెట్టే అవకాశం కనిపిస్తోంది.