బయోపిక్‌ల పరంపరలో… పట్టాలెక్కిన చంద్రబాబు నాయుడు బయోపిక్ `చంద్రోదయం`. టైటిల్ ఎంత బాగుందో.. ఇందులో చంద్రబాబు నాయుడు గెటప్ అంత ఫన్నీగా ఉంది. ఇటీవల విడుదల చేసిన చంద్రబాబు లుక్ చూసి, టీడీపీ అభిమానులే భయపడ్డారు. ఇది బాబు గారి ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర – అన్నట్టు సీరియెస్‌గానే జోకులు వేసుకున్నారు. చంద్రబాబు బయోపిక్ అంటే ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. ఓ రకంగా సేలబుల్ పాయింటే. కాబట్టి చంద్రోదయంపై దృష్టి పడింది. కానీ దాన్ని ఆషామాషీగా తెరకెక్కస్తున్నారన్న సంగతి అర్థమై టీడీపీ అభిమానులంతా హర్టయ్యారు. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఈ బయోపిక్ ఆగిపోయిందట. ఎక్కడ పనులు అక్కడే ఆపేసి – చిత్రబృందం పేకప్ చెప్పేసిందని, దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని టాక్. మొత్తానికి చంద్రబాబు బయోపిక్ ఆగిపోయినట్టే.