ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికి తీరా ఎన్నికలయ్యాక అమరావతిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారని … ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి..మూడు రాజధానులు ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమకు రాజీనామా చేయడం నిమిషం పని అని తేల్చేశారు. అమరావతినే రాజధానిగా ఉంటుందని ప్రజలను నమ్మించి.. మోసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 48 గంటల సమయం ఇస్తున్నానని… మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాజధాని 5 కోట్ల మంది సమస్య అని… మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామనే ధోరణి మంచింది కాదన్నారు. 5 ఏళ్లకు ఓటు వేశారని రాష్ట్ర భవిష్యత్ నాశనం చేస్తున్నారని .. రాజధాని అనేది పార్టీదో, కులానికి సంబంధించి కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల వద్దకు వెళ్దాం.. అందరం ఎన్నికల్లో తేల్చుకుందామన్నారు. ఎన్నికల ముందు రాజధాని మార్చుతామని చెప్పలేదు .. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి..ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందేనన్నారు. మీరు గెలిస్తే రాజధానిపై మేం మాట్లాడబోమని చంద్రబాబు స్పష్టంచేశారు.
జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టబోమని చెప్పారని… ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు చెప్పకుండా చేయడం నమ్మక ద్రోహమేనని తేల్చారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు..వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రకటనలు చేసి.. హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తున్నారని…చర్చ జరుగుతున్న సమయంలో… ప్రజాభిప్రాయం డిమాండ్‌ను… చంద్రబాబు వినిపిస్తున్నారు. దీనికి అసెంబ్లీ రద్దుతో ముడి పెడుతున్నారు. వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో ఉండే… చంద్రబాబు డిమాండ్‌పై ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ప్రజలకు చెప్పింది ..చేస్తుంది..వేర్వేరనే అభిప్రాయం ఉండటంతో…టీడీపీ అధినేత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. 48 గంటల్లో స్పందింకపోతే మళ్లీ మీడియా ముందుకొస్తానని .. నా సవాల్‌ను స్వీకరిస్తారా?, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా? రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని చంద్రబాబు సూచించారు.