టీడీపీ పొత్తుల గురించి వైసీపీ నేతలు సహా అందరూ మాట్లాడేస్తున్నారు కానీ చంద్రబాబు మాత్రం ఒక్క సారి కూడా వీటిపై స్పందించలేదు. ఎవరూ మాట్లాడవద్దని చెప్పేశారు కూడా . కానీ అప్పుడప్పుడూ ఆయన కొన్ని విషయాలపై స్పందిస్తున్న తీరు మాత్రం.. పొత్తులకు షరతులు పెడుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా కుప్పం పర్యటనలో … జగన్ అవినీతిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని నేరుగా ప్రశ్నించడం ద్వారా చంద్రబాబు తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారని అంటున్నారు.
పట్టుకోవాలే కానీ అడ్డంగా దొరికే స్కాములు లెక్క లేనన్ని
అమిత్ షా, జేపీ నడ్డాలు చెప్పినట్లుగా .. ఏపీలో అంతా ఓపెన్ అవినీతే. లిక్కర్ స్కాం ను పట్టుకోవాలంటే.. రెండు రోజులు చాలు. ఆ డబ్బంతా ఎక్కడికి చేరుతుందో.. కనిపెట్టడం పెద్ద విషయం కాదు. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. మధ్యలో నకిలీ లిక్కర్ వాటా ఎంత అనేది అందరికీ తెలిసిన విషయం. పట్టుకుంటే ముఖ్య వ్యక్తిని కూడా జైలుకు పంపవచ్చు. కానీ కావాల్సింది.. అలా పట్టుకోవాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థల పట్టుదల మాత్రమే.
ఇసుకలో అడ్డగోలు దోపిడీ సాక్ష్యాలతో సహా !
టీడీపీ హయాంలో ప్రజలకు ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు తరలి పోకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఒకరి గుప్పిట్లో పెట్టుకుని.. కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నారు. పైగా ప్రభుత్వానికి ఏడు వందల కోట్లు వస్తోందని సొల్లు కబుర్లు చెబుతున్నారు. అటు మద్యం అయినా ఇటు ఇసుక అయినా మొత్తం… నగదు వ్యవహారాలే. అదంతా ఎటుపోతుందో తెలుసుకోవడం.. ఐటీ,ఈడీలకు పెద్ద నా ?
స్కామ్ లేని స్కీమే లేదు!
ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు కాజేశారు. ప్రాజెక్టులకు రివర్స టెండర్ల పేరుతో కొట్టేసిన వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఖజానా నుంచే వేల కోట్లు గల్లంతయ్యాయి. ఇవన్నీ ఫైళ్లు మాయం చేస్తే.. కనిపించకుండా పోయే అవినీతి కాదు. రికార్డుల్లో ఉన్న అవినీతి చర్యలు తీసుకోవలాంటే ఒక్క రోజు పని.
అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నారు. ఇక చాయిస్ బీజేపీ చేతిలోనే !