మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోా పరీక్షలు చేయాలని ప్రయత్నించిన కృష్ణా జిల్లా అధికారులకు పోలీసులు సహకరించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. శని, ఆదివారాలు హైదరాబాద్‌లో ఉండి.. సోమవారం.. చంద్రబాబు అమరావతికి వచ్చారు. ఆయన అమరావతి వస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు.. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కాన్వాయ్‌ను నిలిపివేసి.. కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు.. కలెక్టర్‌ను స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. రెవిన్యూ అధికారులు.. టెస్టులు చేసే వైద్య బృందంతో కలిసి గరికపాడు చెక్ పోస్ట్వద్దకు వచ్చారు. అయితే.. చంద్రబాబు కాన్వాయ్‌ను నిలిపేందుకు పోలీసులు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం.. జడ్ ప్లస్ కేటగరిలో ఉన్న వ్యక్తి కాన్వాయ్‌ను నిలిపివేసి పరీక్షలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో కాన్వాయ్ సాఫీగా వెళ్లిపోయింది.
చంద్రబాబుకు కరోనా టెస్టులు చేస్తామని.. రెవిన్యూ వర్గాలు.. మీడియాకు ముందే సమాచారం ఇచ్చాయి. దాంతో ఆ సమయానికి గరికపాడు వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు కూడా గుమికూడారు. ా సమయంలో పోలీసులు నిబంధనలు చెప్పి.. కాన్వాయ్‌ను ఆపలేదు. దాంతో రెవిన్యూ అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. నిజానికి చెక్ పోస్టుల వద్ద .. ఏపీలోకి ప్రవేశించేవారందరికీ ఎలాంటి పరీక్షలు చేయడం లేదు. ప్రతీ రోజు కొన్ని వందల మంది అధికారులు..నేతలు అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. పాసులున్న వారికి క్వారంటైన్ చెప్పి పంపిస్తున్నారు. సామాన్యులకు ఓ రకంగా.. ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఇంకో రకంగా టెస్టుల ప్రక్రియ నడుస్తోంది.
అయితే.. చంద్రబాబు అనే సరికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. చంద్రబాబుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అనిల్ లాంటి వాళ్లు ప్రకటించారు. దీంతో. చెక్ పోస్ట్ వద్ద నిలిపివేసి కరోనా పరీక్షలు చేస్తారేమోనని అందరూ భావించారు. కానీ.. పోలీసులు మాత్రం అంగీకరించలేదు. పోలీసులు ఇలా… కలెక్టర్ ఆదేశాలను కాదని.. రూల్స్ పాటించాలని చెప్పడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అని అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన మాత్రం… అటు అధికారవర్గాల్లోనూ.. ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.