ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై చాలా కాలంగా.. అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక్క తెలంగాణకే ఫవర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా… కొన్ని పార్టీల్ని కలపడానికి.. విడగొట్టడానికి… ఏపీలో టీడీపీని టార్గెట్ చేయడానికి రాజకీయ మధ్యవర్తిత్వం చేస్తూంటాడని… చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు.. ఏకంగా ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి అతి పెద్ద కుట్ర చేశారనే విషయం మాత్రం.. సంచలనం సృష్టిస్తోంది.
అసలు గవర్నర్ నేరుగా డీజీపీని రిపోర్ట్ అడుగుతారా..?
వైఎస్ జగన్ పై జరిగినట్లు చెబుతున్న దాడి విషయంలో… ఢిల్లీలో ఉన్న గవర్నర్.. తొలి అరగంటలోనే.. అసలు ఏం జరిగిందో.. పోలీస్ బాస్‌కు కూడా పూర్తి గా తెలియని పరిస్థితుల్లో… ఏపీ డీజీపీకి ఫోన్ చేసి.. సీరియస్‌గా రిపోర్ట్ అడిగారు. అసలు ఆ ఘటన జరిగింది ఎయిర్‌పోర్టులో. అది కేంద్ర పరిధిలో ఉంటుంది. ఇలా జరుగుతుందని.. తెలిసినట్లు.. అరగంటలోనే.. దాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టి… నేరుగా డీజీపీని ఆదేశించడం మరో ట్విస్ట్. భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ.. పేపర్ పవర్‌కే అంకితం. ఆయన రాజ్‌భవన్‌కు తప్ప మరి దేనికి అధికారి కాదు. కనీసం ఒక్క బంట్రోతును కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు. కనీసం.. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా నేరుగా ఫోన్ చేసి.. ఆదేశించే అధికారం లేదు. అలా అదేశిస్తే.. ఆయన తన అధికార పరిధిని దాటి… ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘిస్తున్నట్లే. ఇప్పుడు గవర్నర్ కచ్చితంగా అదే చేశారు.
ప్రజాప్రభుత్వంపై పెత్తనం చేయాలనుకున్నారా..?
తనకు లేని అధికారాన్ని ఉందనుకున్నట్లుగా ఉహించుకుని నేరుగా.. ఏపీ డీజీపీకి కాల్ చేశారు. ఎయిర్ పోర్టులో జరిగిన దాని గురించి నివేదిక అడిగారు. ఒక వేళ గవర్నర్‌గా.. తనకు తెలుసుకోవాలని ఉంటే.. ముఖ్యమంత్రిని అడగాలి. నేరుగా ప్రభుత్వ పెద్దలతో డీల్ చేయాలి. అలా వచ్చిన రిపోర్టులతో తనకు చేతనైంది తను చేసుకోవచ్చు కానీ.. ఇక్కడ మాత్రం గవర్నర్ ప్రజాప్రభుత్వంపై తన పెత్తనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఏ విధంగా చూసినా.. ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అది గవర్నర్‌కు తెలియక కాదు. కానీ.. గవర్నర్ మాత్రం అత్యంత వ్యూహాత్మంగా ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేస్తే.. జీహుజూర్ అంటారనుకున్నట్లు ఉన్నారు.
చంద్రబాబు రాజీనామా డిమాండ్ సరైనదేనా..?
గవర్నర్‌గా.. ఏ రాజ్యాంగం వల్ల నరసింహన్ నియమితులయ్యారో.. అదే రాజ్యాంగాన్ని ఆయన ఉల్లంఘించారన్న ఆరోపణలు సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు నుంచి వస్తున్నాయి. ఓ ప్రభుత్వంపై ఢిల్లీ స్థాయిలో చేస్తున్న కుట్రలో గవర్నర్ భాగమయ్యారని..నేరుగా ఆరోపిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సరైనదేనని ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయం. ఆయనకు రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా.. చేసిన తప్పునకు పదవి వదులుకోవాల్సిందే..!