ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు… ఈసీ ఎంత నిర్లక్ష్యంగా.. వ్యవహరిస్తుందో.. మరో విషయాన్ని సాక్ష్యంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా… బయట పెట్టారు. అదే.. వీవీ ప్యాట్ స్లిప్‌లో ఎవరికి ఓటేశారన్న విషయం… కనిపించే స్లిప్… మూడు సెకన్లు మాత్రమే కనిపించడం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఓటర్.. ఓటు వేసిన తర్వాత.. ఆయన ఏ పార్టీకి ఓటు వేశారో అన్న విషయాన్ని నిర్ధారిస్తూ.. ఓ స్లిప్ ప్రింట్ అవుతుంది. అది.. ఏడు సెకన్ల పాటు.. వీవీ ప్యాట్ మెషిన్ లో డిస్ప్లే అవ్వాలి. కానీ… ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఆ సమయం ఏడు సెకన్లు లేదు. కేవలం మూడు సెకన్లు మాత్రమే ఉంది.
ఏడు సెకన్ల పాటు.. ఓటర్‌కు… కనిపిస్తుందని చెప్పిన ఈసీ.. మూడు సెకన్లకే ఎందుకు పరిమితం చేసిందని చంద్రబాబు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి… ఈసీ.. ఇచ్చిన అధికారిక ప్రకటన… ఏపీలోని పీలేరు నియోజకవర్గంలో… వీవీ ప్యాట్ ప్రింటింగ్ వీడియోను.. డిస్ ప్లే చేశారు. కన్నుమూసి తెరిచేలోపు.. ఎవరికి ఓటు వేశామన్న విషయం డిస్ ప్ల్ అయి… క్లోజ్ అయిపోయింది. దీంతో… గ్రామీణ ప్రాంత ఓటర్లు… ఇలాంటి వెరీఫికేషన్ ఒకటి ఉంటుందని తెలియకుండానే… ఓట్లు వేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఇదే విషయాన్ని బలంగా … వినిపిస్తున్నారు. కాన్సిస్టిట్యూషనల్ క్లబ్లో ఇదే విషయాన్ని వీడియోలతో సహా హైలెట్ చేయడం… సంచలనం సృష్టిస్తోంది.
ఈ అంశంపై.. ఈసీ ఇంత వరకూ స్పందించలేదు. టీడీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చిస్తాం కానీ… అదే ఈవీఎం లోపాలపై… పరిశోధన చేసిన… హరిప్రసాద్ అనే నిపుణుడ్ని మాత్రం… వద్దంటోంది. దాంతోనే.. ఈసీపై అనేక అనుమానాలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఆయన అంతర్జాతీయంగా పురస్కారాలు పొందిన సాంకేతిక నిపుణులు. విజయసాయిరెడ్డి లాంటి నేరస్తుల విజ్ఞప్తులతో.. అదే పనిగా.. అధికారులను బదిలీ చేసిన ఈసీ… హరిప్రసాద్ పై క్రిమినల్ కేసు ఉందంటూ.. తప్పించుకునే ప్రయత్నం చేయడం.. మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. హరిప్రసాద్ తోనే చర్చకు రావాలని.. టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈసీ చెబుతున్న క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ.. ఎన్నో సార్లు ఈసీనే అధికారికంగా… హరిప్రసాద్ ను… సమావేశాలకు పిలిచిందన్న ఆధారాలు బయటపెట్టింది.