ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ దశను మార్చేశాయి. హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయి ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు కావడానికి చంద్రబాబు కారణం . ఓ ఐఎస్ బీ అయినా.. మరో ఇండియన్ ఇనిస్టిట్యట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా… భారీ ఎత్తున నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాలు అయినా .. ఔటర్ అయినా మొత్తం చంద్రబాబు విజన్. రాజకీయాల కారణం గా చాలా మంది ఒప్పుకోరు కానీ… కొన్ని సార్లు ఆయన ముద్రలు బలంగానే కనిపిస్తూన ేఉంటాయి.
తాజాగా… హైదరాబాద్ ఐఐఐటీ హెచ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటున్నారు. ఆయన బుధవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోని ఐఐఐటిలలో తొలిగా ప్రారంభించిన జాతీయ గుర్తింపు పొందిన పరిశోధనా విశ్వవిద్యాలయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ సైన్స్ , ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాలలో పరిశోధన చేస్తుంది.