జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థ తేల్చింది. ఆధారాలు లేకుండా ఆ సంస్థ చెప్పదు. జగన్ రెడ్డి తీసుకున్నట్లుగా చెబుతున్న ఆ రూ. 1750 కోట్లు ఏ రూపంలో ఎక్కడ అందుకున్నారు.. అమెరికాలోనే అందుకున్నారా.. ఇండియాలో అందుకున్నారా అన్న దానిపై స్పష్టత త్వరలోనే రానుంది. అయితే అక్కడ కేసు నమోదు కాగానే.. కొంత మంది ఏపీలో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఇంకా చర్యలు తీసుకోలేదు ..ఎందుకని ప్రశ్నిస్తున్నారు?. ఇంకా విషయం బయటపడి వారం రోజులు కాలేదు సోషల్మీడియా చంద్రబాబు జగన్ ను కాపాడుతున్నారని అనేస్తున్నారు.
అదే జగన్ అయితే ఈ పాటికి చంద్రబాబుపై కేసు పెట్టి జైల్లో వేసి ఉండేవారని వాదిస్తున్నారు. అక్కడే ఉంది జగన్ కు .. చంద్రబాబుకు తేడా. జగన్ రెడ్డి చేసేది గుడ్డి రాజకీయం. చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా అని వాటితో ఆడుకుంటాడు. తన ప్రత్యర్థులకు కీడు చేస్తున్నా అనుకుని మేలు చేస్తాడు. కానీ చంద్రబాబు మొదటి నుంచి వ్యూహాత్మక.. ఆలోచనాత్మకంగా రాజకీయమే చేస్తారు. ఉదాహరణకు.. అధికారంలోకి రాగానే సోషల్ మీడియా కేసులు పెడితే ఎఫెక్ట్ ఎలా ఉండేది.. అధికారం వచ్చిందని రెచ్చిపోతున్నారని అనుకుంటారు. కానీ ఇప్పుడు వారందరి తాట తీస్తూంటే.. ఒక్కరైనా వ్యతిరేకిస్తున్నారా ?
అదానీ విషయంలో జగన్ రెడ్డి జుట్టు చంద్రబాబుకు చిక్కిందని అందరికీ తెలుసు. చంద్రబాబు ఇప్పుడు ఆయన మళ్లీమళ్లీ కోలుకోకుండా. ప్రజలు ఛీకొట్టేలా ఏం చేయాలో అదే చేస్తారు. ఒక్క వేటుతో పోయేది కాదు. ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. జగన్ చేసిన పాపాల్ని ప్రజల ముందు ఉంచడానికి అవకాశం వస్తే.. చంద్రబాబు ఎలా ఊరుకుంటారని.. అదీ చంద్రబాబు అంటే అని తర్వాత ఇప్పుడు ప్రశ్నించిన వారే పోస్టులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.