మిచౌంగ్ తుపాను వల్ల ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. తీర ప్రాంతం మొతంలో 30 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సీఎం జగన్ రెడ్డి అదేదో ఫార్ములా వన్ రేసులు చూడ్డానికి వెళ్లినట్లుగా పొలం గట్లు మీద స్టేజులు వేయించుకుని చూసి.. పార్టీ నేతలతో సమావేశాలు పెట్టి.. చంద్రబాబు ఏమీ ఇయ్యలేదని చెప్పి ప్రసంగించారు. కానీ రైతులకు భరోసాగా అసలు ఏమీ ప్రకటించలేదు. ఎకరానికి ఇంత ఇస్తామన్న స్పందన కూడా లేదు. జనవరిలో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. అది ఎకరానికి నాలుగు ,ఐదు వందలు వస్తుంది.
జగన్ రెడ్డి తీరు చూసి రైతులతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా విస్మయానికి గురవుతున్నారు. విపత్తులు వస్తే ఇలా ఎలా వ్యవహరించగలుగుతున్నారని అంటున్నారు. అంతేనా.. కేంద్ర సాయం పొందేందుకూ ప్రయత్నాలు చేయడం లేదు. కేంద్రం తుపాను తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంత మేర సాయం చేసింది. పంటల నష్టానికి నివేదికలు పంపితే మరింత సాయం చేసే అవకాశం ఉంది. కానీ ఏపీ వైపు నుంచి ఇంత వరకూ సాయం కోసం .. చిన్న విజ్ఞప్తి కూడా వెళ్లలేదు. జగన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయకపోతే తానే రాస్తానని.. రైతుల్ని ఆదుకోవాలని కోరుతాన్నారు.
సీఎం జగన్ రెడ్డిలో రైతుల్ని ఆదుకోవాలని కోరికలేకపోవడంతో.. కేంద్రానికి సాయం కోసం లేఖ రాసే ఉద్దేశం కూడా లేకపోవడంతో.. చంద్రబాబునాయుడే ప్రధానికి లేఖ రాశారు. నష్టం అంచనాలకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. నష్టం తీవ్రంగా ఉందని.. లక్షల మంది రైతులు కుదేలయ్యారన్నారు. అలాగే దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి తాగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది.- వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని సాయం చేయాలని కోరారు.