సెప్టెంబర్ ఆరో తేదీన తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసి.. పది నిమిషాల్లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్ మొత్తం చూస్తే… టీఆర్ఎస్ వంద సీట్లతో అధికారం చేపట్టడం అనేది ఫార్మాలిటీ అన్నట్లుగా ఆయన ధీమాతో కనిపించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా… కనిపించారు. చంద్రబాబును కనీసం పరిగణన తీసుకోలేదు. టీడీపీ ఎవరితో కూటమి కట్టినా… డోన్ట్ కేర్ అన్నారు. కానీ.. ఎన్నికల ప్రక్రియ సాగే కొద్దీ… పరిస్థితి మారిపోయింది. గజ్వేల్ సభతో చంద్రబాబునే చూపించి.. ప్రజల్ని ఓట్లు అడిగారు కేసీఆర్. అంతగా సీన్ మారిపోయింది.
చంద్రబాబు చాణక్యం రాజకీయాన్ని మార్చిందా..?
చంద్రబాబుకు రాజకీయ చాణక్యం ఉందని చాలా మంది అంటూ ఉంటారు.. కానీ.. .అసలు సిసలైన రాజకీయ చాణక్యాన్ని చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో చూపించారు. రెండు నెలల కిందట తిరుగులేదనుకున్న రాజకీయ పార్టీ జాతకాన్ని… తలకిందులు చేశారు. ఫలితం ఎలా ఉంటుందో… పదకొండో తేదీన బయటకు వచ్చినా.. తన రాజకీయ వ్యూహాల పవర్ ఎలా ఉంటుందో.. శూన్యం నుంచి రాజకీయ శక్తిని ఎలా పుట్టించగలనో.. చంద్రబాబు నిరూపించారు. అరశాతం, ఒక్క శాతం ఓట్లు అంటూ ఈసడించిన .. టీఆర్ఎస్ పార్టీ అధినేతకు.. మాటల్తో సమాధాన చెప్పలేదు. తన పార్టీ సత్తా ఏమిటో… చేతలతోనే చూపించారు. ఫలితంగా ఇప్పుడు కేసీఆర్‌కు పువ్వుల్లో పెట్టి అందుకోవాల్సిన అధికారం.. అసలు అందుతుందో లేదో.. అన్న స్థితికి చేరింది.
కేసీఆర్ చంద్రబాబును వద్దనుకుని తప్పు చేశారా..?
అసెంబ్లీని రద్దు చేసేటప్పటికీ.. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనేది.. స్పెక్యులేషన్లోనే ఉంది. మహాకూటమి ఏర్పాటు అనే ఆలోచన మదిలోనే ఉంది. కానీ.. మెటీరియలైజ్ కాలేదు. కానీ… ఆ తర్వాత చంద్రబాబు శరవేగంగా కదిలారు. నిజానికి కేసీఆర్‌తో కలిసి వెళ్లాలనుకున్నారు చంద్రబాబు. తెలంగాణపై పెత్తనం చేయడమో.. మరో ఇంట్రెస్టో దీనికి కారణం కాదు. పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో.. సీనియర్లకు టిక్కెట్లు ఇస్తే చాలన్న ప్రతిపాదన కూడా పెట్టారు. కానీ.. దీనికి .. కేసీఆర్, కేటీఆర్ అంగీకరించలేదు. సీమాంధ్రులతో కూకట్‌పల్లిలో జరిగిన సమావేశంలో.. కేటీఆర్ ఈ చర్చల వివరాలను బయట పెట్టారు. పొత్తుకు చంద్రబాబు ముందుకు వచ్చినా.. తామే వద్దన్నామని.. టీడీపీ తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదన్నది తమ భావన అని ఆయన చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత … చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటారు.
కూటమిపై ప్రజల్లో అంత నమ్మకం ఏర్పడటానికి చంద్రబాబే కారణమా..?
ఎప్పుడైతే తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి ఒక్కయ్యాయో… అప్పటి నుంచి రాజకీయవ వాతావరణం మారిపోవడం ప్రారంభించారు. బాహుబలిలా ఫీలైపోయిన కేసీఆర్…టీఆర్ఎస్ కూడా వణకడం ప్రారంభయింది. అప్పటి వరకూ ప్రజల్లో కేసీఆర్‌ను ఓడించడం సాధ్యం కాదన్న భావన సాధారణ ప్రజల్లో కూడా ఉంది. ఇతర పార్టీలకు ఓటేస్తే.. మురిగిపోతుందన్న భావన ఉండేది. కానీ.. ఎప్పుడైతే కూటమిగా తెర ముందుకు వచ్చారో.. అప్పుడే సమీకరణాలు మారిపోయాయి. ఎంతగా అంటే.. కేసీఆర్ కు ఎదురు లేదనుకున్న సామాన్య జనం కూడా.. ఆయనకు ప్రత్యామ్నాయం వచ్చింది.. ఆ వైపు ఓ చాన్సిస్తే పోలా.. అన్న భావనకు వచ్చేంతగా… సమీకరణాలు మారిపోయింది. అంటే.. కేసీఆర్‌కు పోటీ ఉంది అన్న భావనను.. కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకు రాగలిగారు. ఈ విషయంలో… చంద్రబాబు చాణక్యం.. స్పష్టంగా కనిపిస్తోంది.
క్యాడర్‌ను అంత పక్కాగా ఎలా యాక్టివ్ చేయగలిగారు..?
రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో చేసిన ఓ చిన్న తప్పు వల్ల.. తెలంగాణ టీడీపీ చాలా ఇబ్బంది పడింది. చంద్రబాబు తెలంగాణ టీడీపీని పట్టించుకోలేకపోవడానికి కూడా.. ఇదే కారణమన్న అభిప్రాయం… అందరిలోనూ ఉంది. వరుసల వలసలు, ఉన్న నేతలు సైలెంట్‌గా ఉండటంతో.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. ఇతర పార్టీలపై అభిమనం చూపలేదు.. సొంత పార్టీ.. కనుమరుగయ్యే పరిస్థితి ఉండటంతో ఆవేదన చెందారు. అలాగే.. టీడీపీ అంటే అభిమానం అంటే.. ఉన్న ఓటర్లు కూడా.. ఇతర పార్టీలకు తరలి పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ పరిస్థితిని కొద్ది రోజుల్లోనే.. చంద్రబాబు మార్చేశారు. బలంగా.. అందరూ పార్టీ కోసం… పని చేసేలా చేయగలిగారు. ఎన్నికల ప్రచారంలోనే ఇది కనిపించింది. అధికారం కోసం పోటీ పడుతున్న రాజకీయ పార్టీలో ఎంత ఉత్సాహం ఉంటుందో.. తెలుగుదేశం పార్టీలోనూ…ఆ పార్టీ క్యాడర్‌లోనూ అంతే ఉత్సాహం కనిపించింది. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయంతోనే సాధ్యమయింది.
బెదిరింపులకు తలొగ్గని చంద్రబాబు రాజకీయం ..!
రాజకీయాలకు దయాదాక్షిణ్యాలు ఉండవు. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. పోరాడి వీరమరణం పొందినా… గౌరవం ఉంటుంది కానీ.. సరెండర్ అయిపోతే.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో చంద్రబాబు ఎదుర్కొన్న బెదిరింపులు అన్నీ ఇన్నీ కావు.. తనకు సన్నిహితంగా ఉండే ఓ పత్రికాధిపతి.. వారం వారం రాసే.. పొలిటికల్ కాలమ్‌లో… కాంగ్రెస్‌తో కూటమి కడితే.. ఏపీలో కేసీఆర్ ఓడిస్తారని.. ఓటుకు నోటు కేసుల్లాంటివి.. బయటకు తీస్తారని.. కేసీఆర్ మోడీతో జత కట్టి చంద్రబాబు అంతు చూస్తారన్నట్లుగా హెచ్చరికలు చేశారు. కానీ చంద్రబాబు వెనుకడుగు వేయలేదు. అదే ఆయన చాణక్యం. అక్కడే ఆగిపోయి ఉంటే.. దాన్ని పట్టుకుని కేసీఆర్ కానీ..మోడీ కానీ.. మరింతగా చంద్రబాబును తొక్కేసేందుకు ప్రయత్నిచేవాళ్లు. ఈ విషయంలో చంద్రబాబు ధైర్యంగా ముందడుగు వేశారు కాబట్టే… ఈ రోజు రాజకీయం మారిపోయింది.
పదకొండో తేదీన ఎన్నికల ఫలితాల్లో ఏదైనా జరగనీ.. కానీ చంద్రబాబు మార్చిన రాజకీయం మాత్రం.. కచ్చితంగా.. యువ రాజకీయ నేతలకు ఓ పాఠం లాంటిదే. పోరాటంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో .. ప్రయత్నిస్తే.. రాజకీయ వ్యూహాలను.. పక్కాగా అమలు చేస్తే.. ఏదీ అసాధ్యం చాణక్య చంద్రబాబు నిరూపించారు..
——సుభాష్