చంద్రబాబునాయుడు, డీకే శివకుమార్ బెంగళూరులోని దేవనహళ్లి ఎయిర్ పోర్టులు ఎదురుపడ్డారు. చంద్రబాబు కుప్పం వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో దిగిన సమయంలోనే నాగపూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ అక్కడకు వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు ఫ్లైట్ నుంచి దిగి రావడం చూసిన ఆయన పరుగున వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు. క్షేమ సమాచారాల తర్వాత కాస్త పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. ఆ దృశ్యాలను సాయంత్రం లీక్ చేశారు. ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది.
చంద్రబాబు, డీకే శివకుమార్ ఏం చర్చించారని ఏపీని ఓ పార్టీ తెగ ఇదైపోతోంది. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అదే పనిగా డ్యూటీ చేయడం ప్రారంభించారు. అయితే అది ప్లాన్డ్ మీటింగ్ కాదు. ఎదురు పడ్డప్పుడు మాట్లాడుకున్నారు. ప్లాన్డ్ గా రాజకీయాలు చేయాలనుకుంటే అందరి ముందు మాట్లాడుకోవాల్సిన పని లేదు. వారు సీక్రెట్ గా మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా రాజకీయమే మాట్లాడుకుని ఉంటారు. కానీ ఏం మాట్లాడుకున్నారన్నది ఎవరికీ తెలియదు.
ప్రస్తుతం కాంగ్రెస్ తరపున తెలుగు రాష్ట్రాల రాజకీయాలను డీకే శివకుమార్ పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చేరికల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడ కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పై దృష్టి పెట్టారు. గతంలో తెలంగాణలోనే రాజకీయం చేస్తానన్న షర్మిలకు నచ్చ చెప్పి ఏపీలో రాజకీయాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. దానికి ఆమె అంగీకరించారని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో డీకే శివకుమార్ …. ఏపీ రాజకీయాలపై చర్చించారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.