కుప్పంను పులివెందులలా చూసుకుంటా అని సీఎం జగన్ ..మాట ఇచ్చి కొద్ది రోజుల్లోనే అన్నట్లుగానే చేశారు. చంద్రబాబు పర్యటన రెండో రోజు.. వైసీపీ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ జెండాలను బ్యానర్లను చిందరవందర చేశారు. భారీగా ర్యాలీ నిర్వహించిన అల్లరి మూకకు పోలీసులు రక్షణగా ఉండి.. ఈ ధ్వంసం జరిగేలా చూశారు. అన్నీ స్పష్టంగా వీడియోల్లో నమోదయ్యాయి. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించలేదు.
కుప్పంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అత్యంత దారుణంగా శాంతిభద్రతలు దిగజారిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దారుణమైన విషయం ఏమిటంటే పోలీసులే వారికి సహకారం అందించడం.. వైసీపీ అల్లరి మూకలు చేయాల్సినంత రచ్చ చేసిన తర్వాత చిత్తూరు ఎస్పీ కుప్పం చేరుకుని వైసీపీ నాయకుల ఇళ్లకు భద్రత ఎలా ఉందో సమీక్ష చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటికి వందమంది పోలీసుల భద్రత పెట్టారు. కుప్పంలో వైసీపీ విధ్వంసకాండ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఇంత దారుణమైన పరిస్థితులను తీసుకు రావడం ఏమిటన్న విశ్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు వస్తున్నారని తెలిసి తొలి రోజే చంద్రబాబు వెళ్లే రూట్లో పోలీసు సాయంతో వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. వాటిని తొలగించారని చెప్పి కొంత మంది ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారు. తర్వాత ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం విధ్వంసానికే సహకరించారు.