మౌలిక వసతులు ఇంధన రంగానికి సంబంధించి ఏడో శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 617 అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ను వరించాయన్నారు. 1998లోనే తొలి తరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని .. సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు విద్యుత్ రంగంలో చీకట్లు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వ సాధించిన ప్రతి విజయం, ప్రజలకే అంకితం పేరుతో… సమాచార శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభ్యున్నతికి మూలం మౌలిక రంగమేనన్న చంద్రబాబు..ఈ రంగంలో 615 అవార్డుల్ని ప్రభుత్వం సాధించిందన్నారు. 1998లో తొలి తరం విద్యుత్ సంస్కరణలు తీసుకురావడంతో ఇప్పుడు ఇంధనరంగంలో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజనతో విద్యుత్ రంగంలో చీకట్లు ముసురుకున్నా…తక్కవ కాలంలో మిగులు విద్యుత్ సాధించామన్నారు. సౌర, పవన విద్యుత్‌కు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పునరుత్పత్తి విద్యుత్‌పై దృష్టి సారించామన్నారు.ఎనర్జీ సెక్టార్లో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు.
విద్యుత్ రంగంలో రెండోసారి సంస్కరణలకు వెళుతున్నామన్నారు. విద్యుత్ పంపిణీలో నష్టాల్ని నివారించడానికి తగిన చర్యలు
తీసుకుంటున్నామన్నారు. స్థానికంగా విద్యుత్ తయారీకి లోకల్ గ్రిడ్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. స్థానిక విద్యుత్ తయారీ, స్థానిక వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచుతామని, దీంతో కాలుష్యం అరికట్టవచ్చని అన్నారు.రాష్ట్రంలో హైవేలు, రోడ్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి- అనంతపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు 23 వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవుతోందన్నారు. రెండు 164 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లను అప్‌గ్రేడ్ చేశామన్నారు. 715 కిలోమీటర్ల మేర 11 హైవేలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ల్యాండ్ పూలింగ్‌కు రైతులే స్వచ్చంధంగా ముందుకు వస్తుంటే….విపక్ష నేతలకు నిద్ర పట్టట్లేదని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిలో భూ సేకరణలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. భూమి ఇచ్చినవారు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. అయినా సరే కావాలనే కొంతమంది కోర్టుల్లో పిటిషన్లు వేశారని, వరల్డ్‌బ్యాంక్‌కు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి వందల ఎకరాల భూములు ఇచ్చినా ఎయిర్‌పోర్ట్‌లను పూర్తిస్థాయిలో కేంద్రం అభివృద్ధి చేయట్లేదన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి, విజయవాడ నుంచి ఇతర దేశాలకు విమానసర్వీసులకు చాలా డిమాండ్ ఉన్నా… కేంద్రం అడ్డుకుంటుందన్నారు. విభజన చట్టం హామీలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కూడా కేంద్రం అభివృద్ధి చేయట్లేదన్నారు.