పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలలో… నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా.. పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు… పరిశ్రమ, సేవల రంగాలే చోదకశక్తి అనిచారిత్రక కారణాల వల్లే… ఏపీలో సేవా రంగం, పారిశ్రామిక రంగం వెనుకబడ్డాయని విశ్లేషించారు. 12 శాతం వృద్ది రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 10.5 వృద్ధి సాధించామని.. ఆశించిన వృద్ధి సాధిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లవుతుందిన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అభివృద్ధి సాధిస్తే తప్ప.. అభివృద్ది లక్ష్యానికి త్వరగా చేరుకోలేమన్నారు. సర్వీస్ సెక్టార్లో పర్యాటక రంగం కీలకమని. . హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ పర్యాటకానికి ముఖ్యమైన్నారు. జాతీయ సగటు కంటే ఏపీలో ఉత్పత్తి రంగం వృద్ధి రేటు… పదేళ్ల పాటు తక్కువగా ఉంది. పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో అక్రమాలకు పాల్పడటంతో గత ప్రభుత్వాల కాలంలో ఫోక్స్ వాగన్, ప్రోటాన్ వంటి సంస్థలు… పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేశాయన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన… ఆర్థిక ప్రోత్సాహకాలు ఏపీకి దక్కలేదన్నారు.
కేంద్రం వైపు నుంచి రావాల్సిన సాయాన్ని ఇవ్వకపోవడాన్ని శ్వేతపత్రంలో వివరించారు. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం…
కేంద్ర ప్రభుత్వం గ్రాంటు ఇవ్వలేదు, పెట్టుబడి పెట్టలేదని చంద్రబాబు గుర్తు చేశారు ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్లో మాత్రం కేంద్రం పెట్టుబడి పెట్టిందని.. ఏపీని నిర్లక్ష్యం చేశారన్నారు. గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలన్న హామీ కార్యరూపం దాల్చలేదని కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న హమీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం-2017 తెచ్చి పరిశ్రమలకు అవసరమైన 74 సేవలను…నిర్ణీత కాల వ్యవధిలో అందజేయడానికి విశేష కృషి చేస్తున్నామన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొచ్చామని .. మొత్తం 19 శాఖల నుంచి 69 రకాల సేవలను ఈ పోర్టల్ అందిస్తుందని చంద్రబాబు తెలిపారు. 2009-14 మధ్య కాలంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం… సగటున ఏటా రూ. 312 కోట్లు మాత్రమే విడుదల చేశారమన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల స్థాపిస్తామని ప్రకటించారు. ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేశామని వరుసగా మూడు సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించామన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవర్టన్, పతంజలి, జైన్ ఇరిగేషన్… పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ, ఫ్యూచర్ గ్రూప్, కాంటినెంటల్ కాఫీ…ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్, గోద్రేజ్, ఎస్ హెచ్ గ్రూప్.. టాటా ఫుడ్స్, ఐటీసీ, కాన్ఆగ్రో, మన్ పసంద్ పరిశ్రమలు… జౌళి రంగంలో ఎక్స్ పోర్ట్స్, శ్రీ గోవింద రాజ టెక్స్ టైల్స్.. ఎస్ఏఆర్ డెనిమ్, జాకీ బ్రాండ్ ను తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ , అరవింద్ గ్రూప్… నిషా డిజైన్స్, గుంటూరు టెక్స్ టైల్ పార్క్…తారకేశ్వర టెక్స్ టైల్ పార్క్ వంటి సంస్థలు వచ్చాయన్నారు. ఇక ఆటోమోబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్లు, అపోలో టైర్లు… అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, హీరో గ్రూప్ వచ్చాయన్నారు. ఐటీ, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్కాన్, ఫ్లెక్స్ ట్రానిక్స్…డిక్సన్, రిలయన్స్, టీసీఎల్, వోల్టాస్ వంటి సంస్థలు , ఫార్మాస్యూటికల్స్ రంగంలో స్పైరా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్… ల్యూపిన్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, వెస్ట్ ఫార్మా… దివిస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా వచ్చాయన్నారు. వీటి కొన్ని లక్షల మంది ఉపాధి అవకాశాలు లభించాయని ప్రకటించారు. జనవరి 9న రామాయపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుడుతున్నామని.. అదేరోజు పేపరుమిల్లు ఏర్పాటుకు పునాదిరాయి వేయబోతున్నట్లు ప్రకటించారు.