జాతీయ స్థాయిలో చంద్రబాబునాయుడు.. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల ఇరవై రెండో తేదీన… ఢిల్లీలో… కలసి వచ్చి పార్టీలందరితో సమావేశం కాబోతున్నారు. దాదాపుగా పదిహేను పార్టీలు సమావేశానికి హాజరవుతాయి. బీజేపీపై పోరాటానికి తమ సంసిద్ధత తెలుపుతారు. ఆ తర్వాతా డిసెంబర్ 23న … అమరావతి.. ధర్మపోరాట దీక్ష ముగింపు సభు ఉంటుంది. ఈ సభకు రాహుల్ సహా.. కూటమిలోని నేతలంతా హాజరవుతారు. ఇదే సభా వేదికపై… సేవ్ డెమెక్రసీ కూటమిని అధికారికంగా ప్రకటిస్తారు. బహుశా కూటమికి కన్వీనర్‌గా చంద్రబాబును కూడా.. అదే వేదికపై ప్రకటించే అవకాశం ఉంది. ఈ కూటమి తరపున ఉత్సాహం ఎలా ఉంటుందో అన్నది… డిసెంబర్ 11 తర్వాత తేలిపోనుంది. ఆ రోజే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ .. ఓ మాదిరి ఫలితాలు సాధించినా… కూటమి నేతలకు కిక్ వస్తుంది.
సేవ్ డెమెక్రసీ కూటమి విషయంలో చంద్రబాబు ఏ మాత్రం ఆషామాషీగా లేరు. అన్ని పార్టీలను నిత్యం సమన్వయం చేసేందుకు కొంత మంది సీనియర్ నేతలను నియమించారు. వారు.. ఆయా పార్టీలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండి కూటమికి సంబంధించిన ఉమ్మడి వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలతో సమావేశమయ్యే ముందుగా… 19,20 తేదీల్లో… చంద్రబాబు కోల్‌కతా వెళ్తారు. మమతా బెనర్జీతోనూ లాంఛనంగా సమావేశం అవుతారు. వాస్తవానికి.. కూటమి దిశగా అందర్నీ సమాయత్తం చేసే దిశగా.. మమతా బెనర్జీనే.. చంద్రబాబును ప్రొత్సహించారు. డిసెంబర్ ఇరవై మూడున… కూటమి సభకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పదిమంది జాతీయ నేతలు హాజరు కానున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అశోక్ గెహ్లాట్.. అమరావతికి రావడానికి కూడా ప్రధానమైన కారణంగా.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు.. ప్రతిపక్షాల ఐక్యతను… ప్రజలు చాటేలా ఓ కార్యక్రమం పెట్టాలన్న ఉద్దేశంతోనే. అలా అయితే.. ఓటర్లకు గట్టి ప్రత్యామ్నాయం ఉందనే నమ్మకం కలిగిస్తే… మొత్తానికే పని సులువు అవుతుందన్న అంచనాలతో.. అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చారని అంటున్నారు.