టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు పూర్తిగా తన ప్రచార సరళి మార్చారు. చంద్రబాబుతో ప్రారంభించి.. చంద్రబాబుతో ముగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి సభలోనూ… చంద్రబాబు తనతో ముఖ్యమంత్రి పదవి కోసం. .. పోటీ పడుతున్నారని… సైకిల్ గుర్తుకు కానీ.. కాంగ్రెస్ గుర్తుకి కాని ఓటేస్తే… దాని వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నట్లుగా.. ఆయన ప్రసంగిస్తున్నారు. తాను చంద్రబాబును తరమిస్తే.. కాంగ్రెస్ వాళ్లు భుజానపై పెట్టుకుని తీసుకొస్తున్నారని.. మనకు చంద్రబాబు పెత్తనం అవసరమా… అని … ప్రశ్నిస్తున్నారు. ఈ సెంటిమెంట్ మీదే కేసీఆర్ రాజకీయం చేస్తూండటంతో.. .. తెలంగాణలో తాను తేసిన ప్రచారంలో.. చంద్రబాబు తొలి రోజు.. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఓ మాట కూడా అన్నారు. అదే… ప్రజాకూటమి గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు.
నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమిలో చాలా మైనర్ పార్టనర్. కేవలం పదమూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. కాకపోతే.. గెలుస్తామని చాన్స్ ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నారు. ఈ కారణంగా సక్సెస్ రేటు ఎక్కువే ఉండవ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎనిమిది, తొమ్మిది సీట్లు గెలుచుకుంటే.. కూటమిలో.. కీలకం అవుతుందని… ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్దేశించే పరిస్థితి వస్తే కర్ణాటకలో కుమారస్వామి సీఎం పీఠం పొందినట్లు.. టీడీపీ ఎమ్మెల్యే సీఎం పీఠం పొందుతారన్నట్లుగా… కొంత ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే.. చంద్రబాబు పెత్తనం వస్తుందన్నట్లుగా… టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే చంద్రబాబు.. ఈ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఉరట లభించినట్లు చెబుతున్నారు. ఎందుకంటే… ప్రస్తుతం వస్తున్న లెటెస్ట్ సర్వేల వివరాల ప్రకారం.. కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఐదు సీట్ల లెక్కను.. కొన్ని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.
చంద్రబాబు తన పర్యటనలో.. కేసీఆర్ తనపై చేస్తున్న వివాదాస్పద ప్రకటనలన్నింటికీ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎలా ఎదురుదాడి చేస్తుందన్నదే వ్యూహాత్మకం. గత ఎన్నికల్లో ఉన్నంత సెంటిమెంట్ ఇప్పుడు లేదని స్పష్టమైన సంకేతాలు వస్తున్న సమయంలో.. జాతీయ నాయకులంతా.. తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న సందర్భంలో.. అందర్నీ వదిలేసి.. ఒక్క చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటారా…. లేక… వ్యూహం మార్చుకుని… అందరూ కలిసి తెలంగాణపై దండయాత్రకు వచ్చారని.. కొత్త నినాదం అందుకుంటారో చూడాలి..!