ఫేక్ న్యూస్‌పై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. హత్యలు, అత్యాచారాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా వరకూ ప్రతి ఒక్కరిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. 36 మంది ఏపీలో హత్యకు గురయ్యారంటూ ఢిల్లీలో కూడా ప్రచారం చేసిన జగన్.. వారి వివరాలు కూడా ఇవ్వలేదని… ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వెళ్తోందని ఆయన చెప్పారు.
Read Also : ఫ్యాక్ట్ చెక్ : ఏపీకి వెళ్లొద్దని నెదర్లాండ్స్ చెప్పిందా ?
ప్రభుత్వ ప్రాధాన్యాలు, పనులపై ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు ఇదే అంశంపై స్పష్టమైన సూచనలు కూడా చేశారు. దీంతో ఫేక్ న్యూస్ కట్టడిపై పూర్తి స్థాయిలో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసులు పెట్టడంతో పాటు . అలాంటి ట్వీట్లు చేసే వారిపై హిస్టరీ షీట్లు కూడా పెట్టే అవకాశం ఉంది.
వారి సోషల్ మీడియా ఖాతాలపై నిరంతరం నిఘా పెట్టనున్నారు. డబ్బుల కోసం అలాంటి ట్వీట్లు పెడుతూంటే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయంగా పెట్టే ఫేక్ ట్వీట్ల కన్నా.. ఏపీ ఇమేజ్ ను దెబ్బతీసేలా నిరంతరం చేసే ప్రయత్నాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు.