ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. అయితే గతంలో ఈ కేసు విచారణ పలుమార్లు జరిగింది. చంద్రబాబు దాఖలు చేసిన 17ఏ వర్తింపు పిటిషన్ పై తీర్పు వచ్చాకనే విచారణ చేస్తామని తెలిపింది. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ కేసు విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. అలాగే పీటీ వారెంట్ కూడా అమలు చేయబోమని సీఐడీ చెప్పింది.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, 17ఏ వర్తింపుపై తీర్పు ఇంకా రావాల్సి ఉంది. గతంలోనే ఇస్తామని ధర్మాసనం చెప్పింది. తర్వాత దీపావిళి సెలవులు అయిపోయాక ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ తీర్పు ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకుండా పోయింది.ఈ రోజు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చాకే విచారణ చేపడతామని తెలిపేందుకు అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
చంద్రబాబు కేసులకు సంబంధించి అన్ని విచారణలు ఈ కారణంగానే వాయిదా పడుతున్నాయి. ప్రభుత్వం దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైనా ఈ కారణంగానే వాయిదా పడింది. చంద్రబాబుతో పాటు టీడీపీ వర్గాలు కూడా ఈ కేసు తీర్పుపై ఉత్కంఠగా ఉన్నాయి. 17ఏ చంద్రబాబుకు వర్తించకపోతే ఆయనను ఎన్నికల్లో కట్టడి చేయడానికి ఎన్ని కేసులైనా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది.