మీరేం భయపడకండి చంద్రబాబు మళ్లీ వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయడు అని.. మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు జగన్ ను…చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా ఉన్నారు. అలాంటి అభిప్రాయాలే అందరికీ ఉండటంతో నారా లోకేష్ నేను చంద్రబాబు అంతటి మంచోడిని కాదని చెప్పుకోవాల్సి వచ్చింది. అందరి సంగతిచూస్తానని హెచ్చరించారు. అంతా నిజమే అనుకున్నారు. ఏడు నెలలు గడిచిపోయింది. కానీ తప్పుడు పనులు చేసినా.. వేధించిన ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కనీసం చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. దీంతో బాధలు పడిన వాళ్లు బాధపడుతున్నారు.
రఘురామకృష్ణరాజు ..జగన్ అరాచరానికి ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చారు. ఆయనను నిజంగా కస్టడీలో కొట్టకపోతే ఇలా ఏళ్లుగా పోరాడి ఉండేవారు కాదు. కానీ పోరాడుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత అయినా తనకు న్యాయం జరుగుతుందని కొట్టిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆయన ఎదురు చూస్తున్నారు. ఫలితాలు వచ్చిన రెండో రేట్.. గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. ఇప్పటికి ఏడు నెలలు అయింది. అతి కష్టం మీద విజయ్ పాల్ అనే పోలీస్ ఆఫీసర్ ను అరెస్టు చేశారు. మరో చోటా లీడర్ తులసిబాబును ఆయన ఓవరాక్షన్ కారణంగా అరెస్టు చేశారు. లేకపోతే ఆయనను వదిలి పెట్టేవారేమో. అసలు అరాచకాలన్నింటికీ సుత్రధారి పీవీ సునీల్ కమార్ .. హాయిగానే ఉన్నాయి. పోస్టింగ్ ఒక్కటి మాత్రమే లేదు.
ఇలా దాదాపు అన్ని కేసుల్లోనూ ఉన్నాయి. లిక్కర్ స్కాం కేసు ఎక్కడికిపోయిందో.. తెలియడం లేదు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. మైనింగ్ కేసు అంతే. చర్యలు తీసుకోవాలనుకుంటే.. రోజుల్లోనే పూర్తి చేయగలిగినంత స్టఫ్ ఆయా కేసుల్లో ఉంది. తనకు జరిగిన అన్యాయంపై రఘురామ ఇప్పటికీ ఫీలవుతున్నారు. న్యాయం జరగడం లేదని నేరుగానే మీడియాముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరిలో ఇలాంటి అభిప్రాయం ఉండటానికి ఓ కారణం ఉంది.. అదే.. నిజంగా జగన్ రెండో సారి గెలిచి ఉంటే.. కోడెలలా ఆత్మహత్యచేసుకునేవారు… అనుమానాస్పదంగా చనిపోయేవారు.. మానసిక వ్యథతో చనిపోయే టీడీపీ నేతల సంఖ్యను లెక్కించేదుకు కష్టమయ్యేదన్న వాదన ఉంది. అప్పటికే చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రాళ్ల దాడులు చేసింది ప్లాన్డ్ గా చంద్రబాబును చంపడానికే. 70 ఏళ్లు దాటిన వ్యక్తికి రాళ్లు తగిలితే ఎలాఉంటుంది ?. అంతా తెలిసి కూడా.. తిరుగులేనంత అధికారం చేతిలోఉండి కూడా ఎందుకింత ఆలోచిస్తున్నారో .. బాధలు పడిన వారికి అర్థం కావడం లేదు. అందుకే వారి ఆవేదన తరచూ హైలెట్ అవుతోంది.