తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఇండియా కూటమి పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. మమతా బెనర్జీ , అఖిలేష్ యాదవ్, అకాలీదళ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా సహా అనేక మంది జాతీయ నేతలు … న్యాయనిపుణులు చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇాలంటి అరెస్టులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తాయని అన్నారు. ఇండియా కూటమి పార్టీల నుంచి చంద్రబాబుకు లభించిన మద్దతు పూర్తిగా .. వ్యక్తి సంబంధాల వల్లే వచ్చిందని భావిస్తున్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రచారం చేశారు. కానీ తర్వాత దూరమయ్యారు. ఇటీవలి కాలంలో ఏ కూటమితోనూ సన్నిహితంగా లేరు.
బీజేపీతో పొత్తు వార్తలు వచ్చినా చంద్రబాబు అటు వైపు మొగ్గలేదు. కానీ బీజేపీతో కూడా వైరం పెట్టుకునే పరిస్థితి లేదని ఆయన మిన్నకుండి పోయారు. కానీ జగన్ రెడ్డి మాత్రం బీజేపీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ మొహమాటం లేకుండా ప్రతీ దానికి మద్దతిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ నేతలు కూడా వ్యతిరేక ప్రకటన చేశారు. పురందేశ్వరి ,, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ వంటి వారు అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండించారు. అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనకు ఇతర పార్టీల నుంచి వచ్చిన మద్దతు.. స్పందననుబట్టి… జాతీయ రాజకీయాల్లో టీడీపీ విధానం ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ నేతలు గుంభనంగా ఉంటున్నారు. ప్రస్తుతం అక్రమ కేసుల నుంచి బయటపడటం… ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో ఉంచాలని జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలను చేధించడం ముఖ్యమని.. టీడీపీ నేతలు భావిస్తున్నారు.