తెలంగాణతో మళ్లీ రాజకీయాల కోసం జలవివాదాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడంతో చంద్రబాబు సింపుల్ గా పరిష్కారం చూపించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాల్లో పాల్గొన్న ఆయన పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు వంటి వాటిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి పోయే నీటిని తాను రాయలసీమకు తీసుకెళ్తానంటే రాజకీయం చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదన్నారు. కావాలంటే గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు.
గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం చెప్పబోమన్న చంద్రబాబు
కాళేశ్వరం ప్రాజెక్టును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు సభా వేదికగా స్పష్టం చేశారు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని మంచి పనిచేశారని కితాబిచ్చారు. గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు. కొన్ని వేల టీఎంసీల నీరు ప్రతి ఏడాది సముద్రంలోకి పోతున్నాయని వాటిని రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. అందుకే గోదావరి ఇక ముందు కూడా కొత్త ప్రాజెక్టులు కట్టుకున్నా తాను అభ్యంతరం చెప్పబోనన్నారు.
సముద్రంలోకి పోయే నీటిని తరలించుకునే హక్కు ఏపీకి !
ఏపీ దిగువ రాష్ట్రం. ఎగువ రాష్ట్రాలు నిల్వ చేసుకోగలిగినంత చేసుకుని వదిలేస్తే.. వచ్చే నీరు ఏపీకి వస్తుంది. ఆ నీరు గోదావరిలో వేల టీఎంసీలు ఉంటోంది. అది సముద్రం పాలవుతోంది. అందుకే నదుల అనుసంధానం చేసుకుని ఆ నీటిని తాము బనకచర్ల ద్వారా రాయలసీమకు తీసుకెళ్తామంటున్నారు. అయితే ఈ అంశంపై తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాజెక్టు రాజకీయం అవుతోంది. అందుకే చంద్రబాబు ఈ అంశంపై క్లారిటీ ఇస్తున్నారు. గోదావరిపై ఇంకా ప్రాజెక్టులు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని అంటున్నారు.
బీఆర్ఎస్ రాజకీయం – కాంగ్రెస్ కొనసాగింపు
బనకచర్ల ప్రాజెక్టు కట్టేసి వందల టీఎంసీలు రాయలసీమకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని బీఆర్ఎస్ నేతలు రాజకీయం ప్రారంభించారు. అసలు ఈ విషయంలో వివాదమే అక్కర్లేదు. ఎందుకంటే అది ప్రాజెక్టుల్లో నిలబడిన నీరు కాదు .సముద్రంలోకి పోయే నీటిని వరద వచ్చినప్పుడు తరలించడానికి కట్టుకుంటున్న ప్రాజెక్టు. పోలవరం ప్రయోజనాలను పొందడానికి కట్టుకుంటున్న ప్రాజెక్టు. బీఆర్ఎస్ రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ కూడా బనకచర్లకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ జల రాజకీయం చేస్తోంది కాబట్టి.. తాము వెనుకబడిపోతామని కాంగ్రెస్ కూడా అలాంటి ప్రకటనలు చేస్తోందని చంద్రబాబు అంటున్నారు . ఇది కళ్ల ముందుకనిపిస్తున్న నిజమే.