రాజకీయాల్లో డబ్బు ప్రభావం సాధారణమైపోయింది. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడం అన్నది కూడా చాలా పార్టీల లో సర్వసాధారణం అయిపోయింది. అయితే వై ఎస్ ఆర్ సి పి లో పూర్తిగా డబ్బు మీద ఆధారపడి రాజకీయాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే, ఎంపీల టికెట్లను వేలంపాట లా అమ్ముకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి టికెట్లు ఇచ్చే పద్ధతి వైఎస్ఆర్సిపిలో కొనసాగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అయితే ఈ రోజు చంద్రబాబు వ్యాఖ్యానించాడు అన్న సంగతి పక్కన పెడితే, గత కొన్ని రోజులుగా వై ఎస్ ఆర్ సి పి లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి టికెట్లు అన్న పద్ధతి కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. పక్క పార్టీల వారిని, గతంలో జగన్ మీద తీవ్ర పదజాలంతో విమర్శించిన వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, టికెట్ కన్ఫర్మ్ చేయడానికి కారణం వారు మిగతా వారికంటే డబ్బులు లేకపోవడమే అని వార్తలు వచ్చాయి.
అయితే జగన్ మీద టికెట్లు అనుకుంటున్నాడు అని వస్తున్న వార్తలను మీడియా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. గతంలో చిరంజీవి రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ,ఈ ఒక్క ఆరోపణ తోనే మీడియా నాశనం చేయ గలిగింది. రోజంతా ఇదే అంశంపైనా అప్పట్లో డిబేట్లు కొనసాగేవి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఏ మీడియా కూడా జగన్ టికెట్లు అమ్ముకుంటున్నాడు అన్న వార్తకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, వాటి మీద డిబేట్ లు పెట్టడం లేదు. కనీసం ఎన్నికల సమయంలో అయినా మీడియా ప్రజల పక్షాన పని చేస్తుందేమో అనుకున్న వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. మీడియా సహా ఎవరు ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు సారాయి పాటల లాగా, వేలంపాటలో లాగా ప్రజాప్రతినిధుల టికెట్లను అమ్ముకో గలుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ప్రస్తుత మన ప్రజాస్వామ్య దుస్థితి!