తొలి విడతలోనే ఎన్నికలు ముగియడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు… బీజేపీయేతర పార్టీల విజయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం… అన్ని పార్టీల ప్రచారానికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. రెండో విడతలో.. కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా… అక్కడ జేడీఎస్- కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయడానికి ఒక్క రోజు… ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన దేవేగౌడ… చంద్రబాబును కూడా.. తమ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయాలని ఆహ్వానించారు. ఆ మేరకు.. సోమవారం చంద్రబాబు కర్ణాటకకు వెళ్తున్నారు. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మాండ్య సహా.. పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ కర్ణాటకగా పేరుతున్న ప్రాంతాల్లో… తెలుగువారు అత్యధికంగా ఉంటారు. వారు టీడీపీపై అభిమానం చూపిస్తూ ఉంటారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అక్కడ… ఏపీ రాజకీయ నేతలు చేసే హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సారి నేరుగా.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి కోసం చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో… బీజేపీని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కారణం అదో కాదో కానీ… హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ఊహించారు కానీ.. మొత్తానికే.. తేడా కొట్టింది. దాంతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయారు.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంతో కలిసి ఉండే… ప్రాంతాల్లో… చంద్రబాబుపై అభిమానం ఉంది. హిందూపురంకు నీరు అందించేందుకు కాలువల్లో నీరు పారించడంతో.. తమ ప్రాంతంలోనూ.. భూగర్భ నీటిమట్టం పెరిగిందని.. అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అక్కడ మీడియాలోనూ హైలెట్ అయింది. ఇప్పటికే.. కాంగ్రెస్ – జేడీఎస్ లు పొత్తులతో… బలమైన శక్తిగా ఎదిగారు. చంద్రబాబు ప్రచారంతో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకతో పాటు.. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.