ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజేపిపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో తనకు సమస్యలు సృష్టిస్తున్న బిజేపిని దెబ్బ తీసెందుకు తన రాజకీయ అనుభవం, పరిచయాలను అస్త్రలుగా వాడుకొవాలని చంద్రబాబు అలోచిస్తున్నారు. ఇటివల వారంలో రెండు సార్లు ఢీల్లి వెళ్లిన బాబు పలు పార్టీల అధినేతలను ముఖ్యనాయకులను కలిశారు. అందరికి షాక్ ఇస్తు కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యారు. అన్ని పార్టీలను ఒకే విదికపై తీసుకొని వచ్చి బిజేపి వ్యతిరేక కూటమికి అంకురార్పన చేశారు.
ఇదిలా ఉంటే బాబు బేంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడ,ముఖ్యమంత్రి కూమారస్వామితో సమావేశాలు నిర్వహిస్తారు. ఇదే వారంలో తమిళనాడు వెళ్లి స్టాలిన్ ను కూడా కలవబోతున్నారు. వీళ్లతో కూడా బిజేపిని ఓడించడానికి అందరు ఒకే వేదికపైకి రావడం గురించి బాబు విస్తృతంగా చర్చించబోతున్నారు. అయితే గత రెండు వారలుగా జరిగిన పరిణామల నేపధ్యంలో జాతీయ రాజకీయలు, మీడియా దృష్టి మొత్తం చంద్రబాబుపై పడింది. చంద్రబాబు ఇమేజ్ జాతీయ స్థాయిలో పెరిగిందనే చర్చ నడుస్తోంది.
దీన్ని మరింత పెంచుకొవాలని బాబు అలోచిస్తున్నారు. అందుకే వారంలో రెండు రోజులు జాతీయ రాజకీయలకు సమయం కేటాయించాలని చంద్రబాబు అలోచిస్తున్నరంటా. ఇక్కడ పనీ భారం లోకేష్ పై పెట్టి బిజేపిని దెబ్బ తీసెందుకు జాతీయ రాజకీయలకు బాబు సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారంట. త్వరలో ఢిల్లిలో అన్ని పార్టీలతో కలిపి ఐక్య వేదిక నిర్వహించాలని అలోచనలో ఉన్నారు బాబు.