మంత్రుల పని తీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా పదవి చేపట్టినప్పటి నుండి మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. కేటాయించిన శాఖల పరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలు, పనితీరుపై ఈ నివేదిక ఉండాలని సూచించారు. ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఒక్కో శాఖపై విడివిడిగా నివేదికలు తీసుకుంటున్నారు. నిజానికి ఈ నివేదికల్ని ఇవ్వాలని స్వయంగా మంత్రులకే ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. అయితే ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు, శాఖలో మార్పులపై నివేదికలను ఇవ్వలేదు. దీంతో అధికారులకే ఆ బాద్యత ఇచ్చారు. ఇప్పుడు మంత్రుల పనితీరును చంద్రబాబు అసెస్ చేయనున్నారు.
మార్చిలో చంద్రబాబు మంత్రివర్గ మార్పు చేర్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి పూర్తిగా అసెసెమెంట్ పూర్తి చేసి మార్పు చేర్పులపై అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న వారికి కోతలు పెట్టి.. ఒకరిద్దరికి ఉద్వాసన చెప్పినా ఆశ్చర్యం లేదన్న వాదన ఉంది. నాగబాబును ఖాళీగా ఉన్న మంత్రి పదవిలోకి తీసుకోనున్నారు.