ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతోంది. కార్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల జాబితాలో నేడు చేరబోతోంది. చరిత్రలో తొలి సారి మేడిన్ ఆంధ్రా కారు.. రోడ్డు మీదకు వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారును టెస్ట్ డ్రైవ్ చేయనున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమలో తయారైన తొలికారు విడుదలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కారును విడుదల చేయనున్నారు. మిడ్ ఎస్యూవీ రంగంలో వస్తున్న తొలి కారు ధర రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఉంటుంది. క్రెటా, డస్టర్ కార్లకు ఇది పోటీగా ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్కారును మార్కెట్లోకి విడుదల చేసేలా పరిశ్రమలో అత్యాధునిక రోబోటిక్టెక్నాలజీ యంత్రాలు ఏర్పాటు చేశారు.
ఏపీ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయనున్న కియా..!
ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పరిశ్రమల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. అతి తక్కువ కాలంలోనే వేల కోట్లు వెచ్చించి పరిశ్రమను కియా నిర్మించింది. ఏటా మూడు లక్షలకుపైగా కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమయినట్లే. ప్రస్తుతం కంపెనీ సిద్దం చేసిన కారు భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్నీ పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా కియా మోటార్స్‌కు ఇది 15వ ప్లాంట్. భారత్‌లో మాత్రం తొలి ప్లాంట్. స్థానికంగా ఉత్పత్తి అయ్యే వీలైనన్ని విడి భాగాలను వినియోగించడం ద్వారా కార్ల ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకోవాలని కియా మోటార్స్ నిర్ణయించించింది. ఇందుకోసం ప్లాంట్ ఏర్పాటు చేసిన ఎర్రమంచి గ్రామంతో పాటు సమీపంలోని గుడిపల్లి గ్రామం దగ్గర 250 ఎకరాల్లో ఆటోమొబైల్ విడి భాగాలు తయారు చేసే అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేశారు. కియా కంపెనీ 14,200 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2021 నాటికి రెండో దశ పూర్తవుతుంది. రెండో దశ విస్తరణతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 10,000కు చేరుతుంది. 535 ఎకరాల్లో ప్రధాన ప్లాంట్ ను ఏర్పాటు చేసారు. 36 ఎకరాల్లో ఉద్యోగుల కోసం టౌన్షిప్ నిర్మించారు. ఉద్యోగుల శిక్షణ కోసం 11 ఎకరాల్లో శిక్షణా కేంద్రం నిర్మించారు. తొలి దశలో ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి లభిస్తోంది. విడిభాగాల ఉత్పత్తి కోసం సమీపంలోనే 40 అనుబంధ కంపెనీలు ఏర్పటయ్యాయి.
సర్కార్, అధికారుల అకుంఠిత దీక్షకు ఫలితం..!
ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు కృషితో వచ్చిన పరిశ్రమ. కియా పరిశ్రమ.. దేశంలో.. ప్లాంట్ పెట్టాలనుకుందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాము కల్పించే సౌకర్యాలు, ఇచ్చే రాయితీల గురించి పదే పదే చెప్పడమే కాదు.. వారు ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించి.. వెంటనే నిర్ణయం తీసుకునేలా చేయగలిగారు. అధికారులు… రోజుల తరబడి.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన కార్యక్రమాలపై… దృష్టి పెట్టేవారు. కియా ఒక్క సారి పరిశ్రమ స్థాపనకు అంగీకరించిన తర్వాత.. వారికి కల్పిస్తామన్న మౌలిక సదుపాయాల విషయంలో… ఒక్క రోజు కూడా ఆలస్యం కానివ్వలేదు. చెప్పినట్లుగానే… సమయానికి.. భూమి అప్పగించారు. కరెంటు, నీరు.. ఇతర విషయాల్లో వారికి లోటు రానివ్వలేదు. ఫలితంగా.. కియా ప్లాంట్… రావడం.. నిర్మాణం పూర్తి చేసుకోవడం… కార్ల ఉత్పత్తిని ప్రారంభించడం… ఎవరూ ఊహించనంత వేగంగా సాగిపోయింది.
చెదిరిన వోక్స్ వ్యాగన్ కలను కియాతో నెరవేర్చిన చంద్రబాబు..!
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొలి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీకి కార్ల తయారీ పరిశ్రమను తీసుకు రావాలని పరితపించారు. చివరికి ఆయన వోక్స్ వ్యాగన్ బృందాన్ని ఒప్పించగలిగారు. కానీ అదే సమయంలో.. అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం.. కమిషన్ల కక్కుర్తికి… ఆ ప్రాజెక్ట్ పోవడమే కాదు.. ఏపీపై పారిశ్రామిక పరంగా ఓ బ్యాడ్ ఇమేజ్ వచ్చి పడేలా చేసింది. ఆ తర్వాత పారిశ్రామిక పరంగా.. ఏపీకి వచ్చిన భారీ పరిశ్రమలేవీ లేవు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన లక్ష్యం నేరవెర్చుకున్నారు. కియాను తీసుకొచ్చారు. కియా అనే కార్లు ఉన్నాయనే విషయమే చాలా మందికి తెలియదు. కియా పరిశ్రమ వస్తుందని చంద్రబాబు ప్రకటన చేసినప్పుడు.. అందరూ అదో మామూలు ప్రకటన అనుకున్నారు. కానీ శర వేగంగా నిజం చేసి చూపించారు. ఈ క్రెడిట్ ఆయనదే. మేడిన్ ఆంధ్రా కార్లు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా.. ఆ క్రెడిట్ వెనుక కచ్చితంగా చంద్రబాబు పేరు ఉంటుంది.