తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… త్వరలో ఓదార్పు యాత్ర తరహాలో రాజకీయ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. తెలుగుదేశం పార్టీపై దాడులు జరుగుతున్నాయి. ఇలా టీడీపీ.. ఎప్పటికప్పుడు.. ఎవరెవరిపై దాడులు జరిగాయో… సమాచారం సేకరిస్తోంది. వారికి రక్షణగా ఉండేలా.. స్థానిక నేతల్ని పురమాయిస్తోంది. ఇప్పటి వరకూ 150కిపైగా దాడులు జరిగాయని.. ఆస్తుల విధ్వసం… హత్యలు కూడా చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వీరందర్నీ పరామర్శించడానికి చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేసుకునే ప్రయత్నం లో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ దాడులు.. టీడీపీ పెరిగాయని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చిస్తున్న చంద్రబాబు… కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయంలో.. సీరియస్గా ఉన్నారు. హత్యకు గురయిన కార్యకర్తల కుటుంబాలను.. గాయపడిన వారిని.. పరామర్శించేందుకు.. చంద్రబాబు.. వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా నిర్వహించాలి… ప్రభుత్వ తీరును.. వైసీపీ నేతల రౌడీయిజాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశంపై టీడీపీలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇది ఖరారైన తర్వాత చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశం ఉంది.
ప్రతీచోటా కాపలా ఉండలేమంటూ… స్వయంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు.. టీడీపీకి ఆయుధంగా మారాయి. హోంమంత్రి చేతులెత్తేసి… వైసీపీ శ్రేణులకు దాడులు చేసుకోమని సందేశం పంపారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. కార్యకర్తల రక్షణ కోసం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి ఉంటుందంటున్నారు. సోమవారం నుంచి… చంద్రబాబు… గుంటూరులోని టీడీపీ ఆఫీసుకు రోజూ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కొంత సమయం.. పార్టీ కార్యక్రమాలకు.. మరికొంత సమయం.. పార్టీ నేతలతో వ్యూహాల ఖరారుకు కేటాయిస్తారు.