రాఫెల్ విదేశీ యుద్ధ విమానాలను చేర్చుకోవడం భారతదేశానికి గర్వకారణమని, భారత దేశాన్ని ఇది శక్తివంతమైన దేశంగా మార్చిందని చంద్రబాబు కొద్ది గంటల క్రితం చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే అంశంపై ట్వీట్ చేస్తూ దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ ను ఆయనకు గుర్తు చేస్తూ నెటిజన్లు బాబు మాట మార్చారు అంటూ విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే,
చంద్రబాబు ఈ రోజు ట్వీట్ చేస్తూ,”విదేశీ రఫెల్ యుద్ధవిమానాలు, స్వదేశీ తేజస్ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకుని మరింత శక్తివంతమైన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణం. వైమానిక దళ 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తోన్న వైమానికదళ వీరులకు, వారి కుటుంబాలకు గౌరవాభివందనం. ” అని రాసుకొచ్చారు.
విదేశీ రఫెల్ యుద్ధవిమానాలు, స్వదేశీ తేజస్ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకుని మరింత శక్తివంతమైన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణం. వైమానిక దళ 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తోన్న వైమానికదళ వీరులకు, వారి కుటుంబాలకు గౌరవాభివందనం. pic.twitter.com/Tum1Lmi3fa
— N Chandrababu Naidu (@ncbn) October 8, 2020
అయితే ఇదే చంద్రబాబు గతంలో దేశంలోనే అతిపెద్ద రక్షణరంగ కుంభకోణం ఇది అని మోడి న తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో ఆయన ట్వీట్ చేస్తూ” PM @narendramodi’s silence on Rs. 59,000 Cr Rafale deal & reports on the possibility of India’s Biggest Defence scam directly involving the PMO, speaks volumes of BJP govt’s destructive decisions. Modi ji, truth cannot be hidden for long when you cheat the nation.
PMO’s interference in the name of “parallel negotiations”, bypassing the Ministry of Defense in finalizing Rafale deal, undermined the negotiating position of the Indian Negotiating Team. These revelations are shocking. They indicate a lack of integrity & regard within BJP govt.” అని రాసుకొచ్చారు.
PMO’s interference in the name of “parallel negotiations”, bypassing the Ministry of Defense in finalizing Rafale deal, undermined the negotiating position of the Indian Negotiating Team. These revelations are shocking. They indicate a lack of integrity & regard within BJP govt.
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2019
ఈ రెండు ట్వీట్ లను నెటిజన్లు పక్క పక్కన పెట్టి చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుని మోడీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, ఎన్నికల తర్వాత బీజేపీని మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వాదనలు ఉన్న నేపథ్యంలో, ప్రజలు యూటర్న్ అని అంటారు అని తెలిసి కూడా చంద్రబాబు విదేశీ యుద్ధ విమానాలను ప్రస్తుతం పొగుడుతూ ట్వీట్ చేయడం, దానిమీద నెటిజన్లు విమర్శలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.