“భవిష్యత్ ప్రణాళికలు” అనేది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన కనీస లక్ష్యం. అది లేకపోతే గాలి ఎటు వస్తే జీవితం అటు పోతుంది. అవకాశాల్ని అందిపుచ్చుకుని లేకపోతే సృష్టించుకుని అనుకున్న లక్ష్యంగా దిశగా వెళ్లాలంటే భవిష్యత్ ప్రణాళికలు చాలా ముఖ్యం. ఓ వ్యక్తిగా మనం అలాంటివి పెట్టుకుని ముందుకెళ్తే మనం బాగుపడతాం.. కుటుంబం బాగుపడుతుంది. అదే సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యతలో ఉన్న లీడర్లు..భావి భవిష్యత్ తరాల వృద్ధిపై సారించి..ఇప్పటి పరిస్థితుల్ని మర్చిపోకుండా ముందుకెళ్లాలి. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ముందుకెళ్తారు. తాజాగా ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ 2047 కూడా అలాంటిదే.
చంద్రబాబు విజన్ కు మరింత హ్యూమన్ టచ్
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా కీలకమే. అందుకే చంద్రబాబు విభిన్న రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వికాసానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ప్రజల ప్రమేయం లేకుండా.. వారి అభివృద్ధి జరగకుండా ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే చంద్రబాబు కుటుంబాల ఆర్థిక ప్రగతి కేంద్రంగానే ఈ సారి విజన్ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆ ప్రకారం విస్తృతంగా విద్య, ఉపాధి, నైపుణ్య పెంపుదల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు.
మైక్రో లెవల్‌కు ప్రణాళికల అమలు
విజన్ 2047 డాక్యుమెంట్ అమలు సమాంతరంగా వేరే పద్దతిలో జరగదు. రోజు వారీ పాలనలో లక్ష్యాలు సాధిస్తూ వాటిని క్షేత్ర స్థాయికి వికేంద్రీకరించడం ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ ను అమలు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే కేంద్రంగా ఈ కార్యక్రమాల అమలు జరుగుతాయి. వారికి ఇది అధికారం కాదు బాధ్యత లాంటింది. క్షేత్ర స్థాయిలో అనుకున్న విధంగా కార్యక్రమాల అమలు జరగాలంటే..ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండాలి.
సామాన్యులకు అర్థం కాకపోవచ్చు కానీ ప్రణాళిక అదుర్స్
చంద్రబాబు ఒకప్పుడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. అప్పటి వరకూ ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్న కామెంట్స్ చేశారు. నిజానికి ఎవరు ఉన్నా.. ఎవరు పోయినా .. మరో తరం ఉంటుంది. అలా అన్న వారి పిల్లలు.. వారి పిల్లలు ఈ తరంలో ఉంటారు. వారు ఆ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. పాలకులు తాత్కాలిక ప్రయోజనాల కోసం పని చేస్తే భవిష్యత్ తరం కూడా పేదరికంలోనే ఉంటుంది. ఏదీ గాలికి జరిగిపోదు. అన్నీ ఎవరో ఒకరు చేయాలి. అలా చేయాల్సింది పాలకులే. భవిష్యత్ తరానికి భరోసా ఇవ్వాల్సింది పాలకులే. ఎవరేమనకున్నా.. చంద్రబాబు తన బాధ్యతను తాను వంద శాతం నిర్వహిస్తున్నారు. సమాజం, ప్రజలు కూడా అంతే బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది.