తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పాత సహచరుడు కేసీఆర్ ను యశోదా ఆస్పత్రిలో పరామర్శించారు. బాత్ రూంలో జారిపడటంతో కేసీఆర్ తుంటి విరిగింది. దీంతో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆయన కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. గతంలోనూ ఓ సారి ఇలా జారిపడిన ఘటనను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సారి మరో వైపు గాయం అయిందని తెలిపారు.
టైల్స్ స్మూత్ గా ఉంాయని.. మనం ఎక్కడో ఆలోచిస్తంటామని జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అన్నారు. డాక్టర్లతోనూ మాట్లాడారు. కేసీఆర్ త్వగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పరామర్శ తర్వాత ఆస్పత్రి ముందు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో మాట్లాడాలనిపించి వచ్చానని.. వైద్యులు ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారన్నారు. చంద్రబాబు, కేసీఆర్ చాలా కాలం తర్వాత మాట్లాడుకున్నారు.
దాదాపుగా ఐదారేళ్లుగా వారిద్దరూ ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదు. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉంది. సుదీర్ఘ కాలంగా కలసి పని చేశారు. మధ్యలో రాజకీయ కారణాలతో విడిగా పయనం చేస్తున్నప్పటికీ.. పరస్పర విమర్శలు చేసుకున్నప్పటికీ… ఇలాంటి సమయాల్లో రాజకీయాలను పక్కన పెట్టి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.