ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హౌదా నిరాకరణ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతున్నదే గాని చల్లారడం లేదు.దీనిపై అధికార తెలుగుదేశం కూడా ఎంతో కొంత మాట్లాడక తప్పడం లేదు. వారు ఎంత సుతిమెత్తగా మాట్లాడినా బిజెపి నేతలు మాత్రం రెచ్చిపోయి విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు బిజెపి నేతలెవరో అన్ని నిధులు ఒకేసారి రావడానికి అంతా మారిపోవడానికి ఇదేమైనా విఠలాచార్య దర్శకత్వమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్‌టివిలో యాంకర్ రిషి ఈ విషయమై అడిగారు. విఠలాచార్య కాదు కదా అంతా అమిత్ షా దర్శకత్వమే అని నేనన్నాను. అయినా చంద్రబాబు అమరావతిని అందరూ బాహుబలి గ్రాఫిక్స్‌తో పోల్చారు గనక ఆయనను గురించి చెబితే రాజమౌళి దర్శకత్వం గుర్తు చేయాలి గాని విఠలాచార్య అంటే ఎలా అని ప్రశ్నించాను.నిజంగానే అమరావతి గురించిన వార్తలు మొదలైనప్పుడు చాలా మంది ఇది బాహుబలిలా వుందని వ్యాఖ్యానించిన మాట నిజం.
సభ సాక్షిగా పదేళ్ల ప్రత్యేక హౌదా కావాలని అడిగి ఎన్నికల ప్రణాళికలోనూ దాన్ని పొందుపర్చిన బిజెపి ఇప్పుడెలా మాట తప్పుతుంది? ఈ మాట అంటే కొందరికి భరించలేని కోపం.