సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి జీపీఎస్‌ను ఉద్యోగుల నెత్తి మీద రుద్దిన జగన్ రెడ్డి వ్యవహారంతో ఉద్యోగులు రగిలిపోయారు. ఇప్పుడు వారిని చంద్రబాబు చల్లబరిచారు. జగన్ రెడ్డి ఇచ్చిన జీవోను నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. జగన్ సర్కార్ జీపీఎస్ ను రూపొందించినప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు హర్షాతిరేకాలు తెలిపారు. కానీ మెజార్టీ ఉద్యోగులు మాత్రం .. వ్యతిరేకించారు. ఎన్నికలు రావడంతో ఆ జీవో పెండింగ్ లో పడిపోయింది.
అయితే హఠాత్తుగా కొత్త ప్రభుత్వంలో ఆ జీవో బయటకు వచ్చింది. తాజాగా చంద్రబాబు సర్కార్ ఇచ్చినట్లుగా ఉన్న ఆ జీవోతో నీలి మీడియా రాజకీయం ప్రారంభించారు. ఆ జీవోతో ఉద్యోగుల కొంప కొల్లేరు అవుతుదని రాసి ఆందోళనలకు ప్రేరేపించింది. కానీ జగన్ ఇచ్చిన జీవో అన్న విషయాన్ని మాత్రం మర్చిపోయింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా… గెజిట్ ఎలా విడుదల చేశారని చంద్రబాబు ఆరా తీశారు. సంబంధిత అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో విచారణకు ఆదేశించారు.
తక్షణం జీపీఎస్ అమలు రద్దు జీవో నిలిపివేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశంతో ఉద్యోగులకు రిలీఫ్ లభించినట్లయింది. జగన్ చేసిన మోసాన్ని సరి దిద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.