పాలకుడికి ఓ విజన్ ఉండాలి. అది ఉండాలంటే మొత్తం సబ్జెక్ట్ పై అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఓ రోడ్ మ్యాప్ పెట్టుకుని మెల్లగా లక్ష్యంగా దిశగా వెళ్తారు. అసలేమీ తెలియకుండా.. వందల కొద్దీ సలహాదారుల్ని పెట్టుకుని బూతుల ప్రయోగాల్లో రాటుదేలిపోతే ప్రజలకు ఏం ఒరుగుతుంది ?
జగన్ రెడ్డిపై రాయలసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఆయన చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని .. పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టిస్తారనే ఆశలు కాదు. రాయలసీమ ప్రజల నీటికష్టాలు తీరుస్తారని.. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తారని.. బతుకులు మారుస్తారని ఆశలు పెట్టుకున్నారు. అందుకే రాయలసీమ మొత్తం ఆయనకు జై కొట్టింది. మూడు సీట్లు తప్ప… టీడీపీకి వచ్చిందేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి చేయాలి. .? సీమ ప్రజల రుణం తీర్చుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు ? వారి రక్తం తాగుతున్నారు కానీ.. భవిష్యత్‌కు భరోసా మాత్రం ఇవ్వడం లేదు .
చంద్రబాబు హయాంలో సీమను సస్యశ్యామలం చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకెళ్లారు. వేగంగా పనులు చేయిస్తూ నిధుల కొరత రాకుండా చేశారు. కానీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చి మొత్తం ఆపేసింది. రివర్స్ టెండర్ల పేరుతో పనులన్నీ ఆపేశారు. మళ్లీ ప్రారంభం కాలేదు. కానీ వేల కోట్ల బిల్లులైతే బొక్కేశారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత జగన్ రెడ్డి చేసిన అన్యాయంపై సీమలో ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఇంత అన్యాయం చేస్తారా అని ఆవేశ పడకుండా ఉండలేరు.
కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సీమ ప్రయోజనాలు నీటి హక్కుల గురించి మాట్లాడే మేధావులు… ఎంత మంచి చేస్తున్నా… విమర్శలు చేసేవారు. ఇప్పుడు జగన్ రెడ్డి కొంప కూల్చేస్తున్నా…. భవిష్యత్ లోనూ నీటి అవసరాలు తీరకుండా చేస్తున్నా నోరెత్తడం లేదు. సీమకు అసలు శాపం.. .. ప్రజలకు నిజాలు చెప్పని.. కుల పరంగా రాజకీయాలు మేధావి ముసుగులోని మరుగుజ్జులే. రాయలసీమకు అసలైన శాపం వాళ్లే.